Breaking News

బాలీవుడ్ నిర్మాతల పరువు తీసేసిన హిందీ స్టార్ హీరో

Published on Mon, 03/24/2025 - 15:14

ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే అందరూ బాలీవుడ్ అనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. 'బాహుబలి', 'పుష్ప 1& 2', 'ఆర్ఆర్ఆర్' తదితర చిత్రాలతో తెలుగు సినిమా ఎనలేని పేరు గడిస్తోంది. దీంతో బాలీవుడ్ హవా రోజురోజుకీ తగ్గిపోతోంది. ఇండస్ట్రీపై ఇదివరకే పలువురు విమర్శలు చేయగా.. ఇ‍ప్పుడు స్టార్ హీరో సన్నీ డియోల్ బాలీవుడ్ పరువు తీసేశాడని చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: రిలీజ్ కి ముందే రూ.58 కోట్ల కలెక్షన్)

'యానిమల్'లో విలన్ గా నటించిన బాబీ డియోల్ అన్నయ్య సన్నీ డియోల్. కొ‍న్నాళ్ల క్రితం 'గదర్ 2' మూవీతో అద్భుతమైన హిట్ కొట్టాడు. తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని ఇతడిని హీరోగా పెట్టి 'జాట్' అనే సినిమా తీశాడు. తాజాగా సోమవారం ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సన్నీ డియోల్.. హిందీ నిర్మాతలపై కౌంటర్స్ వేశాడు.

'ముంబై ప్రొడ్యూసర్స్.. జాట్ నిర్మాతలని చూసి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఒకసారి స్క్రిప్ట్ అంతా లాక్ అయితే పూర్తిగా దర్శకుడిపై నమ్మకం ఉంచుతారు' ‍‍అని సన్నీ డియోల్ చెప్పుకొచ్చాడు.

ఇతడు హీరోగా లాహోర్ 1947 అనే మూవీ మొదలైంది. కానీ అది ఆలస్యమవుతూ వస్తోంది. ఇలా లేట్ అవుతుండటంపైనే సన్నీ.. పరోక్షంగా అసంతృప్తిని వెళ్లగక్కడా అనిపిస్తోంది. ఇకపోతే జాట్ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రాబోతుంది. తెలుగు నిర్మాణ సంస్థలైన మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా సంయుక్తంగా నిర్మించాయి.

(ఇదీ చదవండి: 'కన్నప్ప' మూవీని ట్రోల్ చేస్తే శాపానికి గురవుతారు: రఘుబాబు)

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)