Breaking News

మీరేమి బాడీ బిల్డర్లు కాదు.. యంగ్‌ హీరోలపై సన్నీ సెటైర్లు!

Published on Sat, 08/12/2023 - 20:00

గదర్- 2 సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్. ఈ చిత్రంలో అమీషా పటేల్ హీరోయిన్‌గా నటించింది. అనిల్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కించారు. అనిల్ శర్మ తనయుడు ఉత్కర్ష్ శర్మ కూడా కీలక పాత్రలో కనిపించారు. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రికార్డ్ స్థాయి కలెక్షన్స్‌ రాబడుతోంది. ఈ నేపథ్యంలో సన్నీడియోల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా కొత్త తరం నటీనటులను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడారు. పరిశ్రమకు నటులు కావాలని.. బాడీబిల్డర్లు అవసరం లేదని చురలకలంచటించారు.

గదర్ -2 సక్సెస్ కావడంతో సన్నీ నేటి యువ హీరోలకు ఓ సలహా ఇచ్చాడు.  ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యువనటులు బాడీబిల్డింగ్‌పై మాత్రమే దృష్టి పెట్టకుండా.. నటనపైనా దృష్టి పెడితే బాగుంటుందని సూచించాడు. 

సన్నీ మాట్లాడుతూ.. "బాడీబిల్డింగ్, డ్యాన్స్ చేయడం మానేయండి. నటనపైనే దృష్టి పెట్టండి. మీలో ఉన్న ప్రతిభను ముందుకు తీసుకెళ్లండి.  ఎందుకంటే మనకు కావల్సింది అదే. మీరేమి బాడీ బిల్డర్లు కాదు. మీరు ఫిట్‌గా, దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలి. సంగీతం అనేది మన సంస్కృతిలో ఒక భాగం. మీరందరూ నా పాత చిత్రాలను చూశారని తెలుసు. అంతకుముందు చాలా మంది నటీనటులు ఉన్నారు. ఇప్పడున్న చాలా మంది కొత్తవారు గొప్పగానే పని చేస్తున్నారు. మీరు కేవలం కండలు తిరిగిన వ్యక్తుల కంటే.. ప్రేక్షకులు మిమ్మల్ని హీరోలుగానే చూసేలా ఉండండి.' అంటూ సలహా ఇచ్చాడు. 

గదర్ -2 గురించి సన్నీ మాట్లాడుతూ.. 'ఇది చాలా పాత చిత్రంలా అనిపిస్తుంది. కానీ మేము ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా తెరకెక్కించాం. ఫిల్మ్ మేకింగ్ ఎలా అభివృద్ధి చెందిందని సన్నీని ప్రశ్నించగా.. సినిమా తీసే విధానం మారలేదు.. సాంకేతికత అభివృద్ధి చెందుతోంది. అది మరింత వేగంగా విస్తరించింది.అయినప్పటికీ మన సంస్కృతి, విలువలు, చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉంటాయి.' అని అన్నారు. కాగా.. గదర్- 2 అనేది 2001లో విడుదలైన గదర్: ఏక్ ప్రేమ్ కథా చిత్రానికి సీక్వెల్‌గా రూపొందించారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)