Breaking News

ఆయన మరణం తర్వాత నన్ను ఏ సంఘటన కదిలించడం లేదు: సునీత

Published on Mon, 02/06/2023 - 13:05

టాలీవుడ్‌ స్టార్‌ సింగర్‌ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మధుర గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే ఆమెకు పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. సింగ‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారామె. ఇక తన జీవితంలో ఆమె ఎన్నో ఒడిదుడుకులు చూసిన సునీత తన కన్నీరు ఇంకిపోయాయనిచ, ప్రస్తుతం తనకు కన్నీళ్లు రావడం లేదంటూ తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇండస్ట్రీలో ఆమె ఎక్కువ అభిమానించేది లెజెండరి సింగర్‌ దివంగత  ఎస్పీ బాలసుబ్రమణ్యం అనే విషయం తెలిసిందే. 

చదవండి: అప్పట్లో సంచలనమైన మాధురీ లిప్‌లాక్‌, అత్యంత కాస్ట్లీ కిస్‌ ఇదేనట!

ఆయనను మామయ్య అంటూ అప్యాయంగా పిలుస్తారామె. ఇక ఎస్పీ బాలు మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణాంతరం బాలుగారిని గుర్తు చేసుకుంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుని సునీత కన్నీరు పెట్టుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా ఈ ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. ‘నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి బాలూగారిని పోగొట్టుకున్నాను. ఆ సంఘటన తరువాత నాకు కన్నీళ్లు రావడం లేదు. జీవితంలో అంతకు మించి చలించే సంఘటనలు ఇంకా ఏముంటుంది? అనిపించింది. ఆయన మరణవార్త తర్వాత అంతగా నన్ను ఏ సంఘటనలు కదిలించడం లేదు.

చదవండి: అప్పుడే ఓటీటీకి వారసుడు మూవీ! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌?

ఆయన జ్ఞాపకాలతో .. ఆయన చూపించిన మార్గంలో నడవడమే ఆయనకి మనమిచ్చే గౌరవం’ అని అన్నారు. అనంతరం తనపై వచ్చే విమర్శలపై స్పందించింది. ‘జీవితంలో నాకంటూ కొన్ని విలువలు, బాధ్యతలు ఉన్నాయి. నన్ను ద్వేషించేవారినీ, విమర్శించేవారిని పట్టించుకోకుండా నా ముందున్న లక్ష్యాన్ని చేరుకోవడానికే ప్రయత్నిస్తూ వెళ్లాను. నేను ఏం చేయాలి, ఏం చేయగలను అనే స్పష్టత నాకు ఉంది. ఆ క్లారిటీతోనే ముందుకు వెళ్తున్నా’ అని చెప్పుకొచ్చారు. కాగా కరోనా మహమ్మారి బారిన పడిన బాల సుబ్రహ్మణ్యం సుదీర్ఘ పోరాటం అనంతరం 2020 సెప్టెంబర్ 25న తుదిశ్వాస విడిచారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)