మరో అమ్మాయితో నా భర్త డేటింగ్‌.. వదిలిపెట్టను : స్టార్‌ హీరో భార్య

Published on Fri, 12/26/2025 - 17:53

బాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ హీరో గోవిందా, ఆయన భార్య సునీత ఆహుజా విడాకులు తీసుకోబోతున్నారనే వార్త గత కొంతకాలంగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం వీరిద్దరు సపరేట్‌గా ఉంటున్నారు. కానీ అధికారికంగా విడాకులు అయితే తీసుకోలేదు. కోర్టు ద్వారా గోవిందాకు నోటీసులు అందించారని..త్వరలోనే విడాకులు తీసుకునే అవకాశం ఉందని బాలీవుడ్‌ వర్గాల చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా భర్త గోవిందాపై సునీత(Sunita Ahuja) సంచలన ఆరోపణలు చేసింది. తన భర్తకు మరొక అమ్మాయితో వివాహేతర సంబంధం ఉందని.. డబ్బుల కోసమే ఆమె ఆయనకు దగ్గరైందని ఆరోపించారు.

తాజాగా ఆమె ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల రూమర్స్‌పై స్పందించారు. ‘మేమిద్దరం సపరేట్‌గా ఉంటున్న విషయం నిజమే. గోవిందా(Govinda) మరోక అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నాడు. ఆ అమ్మాయి అతన్ని ప్రేమించడం లేదు.. డబ్బుల కోసమై దగ్గరైంది. ఆమె హీరోయిన్‌ అయితే కాదు. హీరోయిన్లు ఇతరుల కాపురాల్లో చిచ్చు పెట్టేంత చెడ్డవాళ్లు కాదు’ అని సునీత చెప్పుకొచ్చారు. 

ఇంకా మాట్లాడుతూ..గోవింద జీవితంలో ముగ్గురే మహిళలు కీలకంగా ఉండాలని కోరుకున్నాం. ఆమె తల్లి, భార్య, కూతురు.. ఈ ముగ్గురు మహిళలే ఆయన జీవితంలో ఉండాలకున్నాం. కానీ నాలుగో మహిళ రావడం జీర్ణించుకోలేకపోయామని సునీత ఎమోషనల్‌ అయ్యారు. ఇప్పటికైనా గోవింద తన చుట్టు ఉన్న చెంచాలను వదిలేసి.. వర్క్‌పై ఫోకస్‌ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. 

కాగా.. సునీతా అహుజా, గోవిందల పెళ్లి 1987లో జరిగింది వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు యశ్‌, కూతురు పేరు టీనా. గత ఏడాదిగా వీరిద్దరు వేరు వేరుగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. విడాకుల రూమర్స్‌ వినిపిస్తున్నా.సునిత మాత్రం గోవిందా ఎప్పటికీ తనవాడే అని.. వదిలేసే ప్రసక్తే లేదన్నారు. 
 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)