Breaking News

అయ్యో.. నా రాముడికి ఎలాంటి పరిస్థితి? మనసు బరువెక్కింది

Published on Sat, 01/20/2024 - 16:27

ఆధ్యాత్మిక పాత్రలను వెండితెరపైనే కాదు బుల్లితెరపైనా రక్తి కట్టించినవాళ్లున్నారు. వెండితెర కంటే అద్భుతంగా సీరియల్స్‌ ద్వారా జనాలకు చేరువైన కథలున్నాయి. అలా ఎన్నో భక్తి ప్రధాన సీరియల్స్‌ ప్రేక్షకులను మైమరపింపజేశాయి. అందులో రామాయణ్‌ సీరియల్‌ ఒకటి. ఈ సీరియల్‌లో రాముడు, లక్ష్మణుడు, సీతగా నటించిన ముగ్గురికీ అయోధ్య రామాలయ ప్రారంభం కోసం ఆహ్వానం అందింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితమే అయోధ్యను వీరు సందర్శించారు.

రాములవారికి ఎలాంటి పరిస్థితి?
శ్రీరాముని ఆలయాన్ని చూసి తన్మయత్వానికి లోనయ్యారు. రామాయణ్‌ సీరియల్‌లో లక్ష్మణుడిగా నటించిన సునీల్‌ లహ్రి అయితే తనను తాను మైమరిచిపోయాడు. తాజాగా అతడు తన మనసులోని మాటలను మీడియాతో పంచుకున్నాడు. సునీల్‌ లహ్రి మాట్లాడుతూ.. 'అయోధ్యకు వెళ్లినప్పుడు నేను భావోద్వేగానికి లోనయ్యాను. ఇక్కడే కదా రాములవారు పుట్టిపెరిగింది. కానీ ఆయనకు ఎలాంటి పరిస్థితి వచ్చింది. టెంట్‌ కింద విగ్రహాన్ని ఉంచారు.

వారి త్యాగం ఊరికే పోలేదు
అది చూసి నాకు ఎంతో బాధేసింది. మూడు దశాబ్దాల తర్వాత తిరిగి అదే ప్రదేశంలో ఆయనకు గుడి కట్టినందుకు మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. 500 ఏళ్లుగా దీని కోసం పోరాడాం. ఎంతోమంది తమ ప్రాణాల్ని సైతం లెక్క చేయలేదు. వారి త్యాగం ఊరికే పోలేదు. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరిగే రోజు (జనవరి 22) భారతదేశ చరిత్రలో నిలిచిపోతుంది' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: ప్రియుడితో ప్రేమలో టాలీవుడ్‌ హీరోయిన్‌.. ఫిబ్రవరిలోనే పెళ్లి!

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)