Breaking News

సౌత్‌లో విలన్లుగా బాలీవుడ్‌ హీరోలు.. నచ్చట్లేదు!

Published on Fri, 11/28/2025 - 09:21

కొంతకాలంగా సౌత్‌ సినిమాల్లో బాలీవుడ్‌ యాక్టర్స్‌ విలన్‌గా మెప్పిస్తున్నారు. ఈ ధోరణి తనకు నచ్చలేదంటున్నాడు ప్రముఖ నటుడు సునీల్‌ శెట్టి (Suniel Shetty). దక్షిణాది చిత్రాల్లో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలను మాత్రమే ఆఫర్‌ చేయడం సబబు కాదంటున్నాడు. ద లాలంటాప్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్‌ శెట్టి మాట్లాడుతూ.. నాకు సౌత్‌ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. 

నచ్చట్లే..
కానీ ఇక్కడేం జరుగుతుందంటే మాకు నెగెటివ్‌ పాత్రలే ఆఫర్‌ చేస్తున్నారు. హిందీ హీరోలను శక్తివంతమైన విలన్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాకు, ప్రేక్షకులకు అదే కిక్కిస్తుందని చెప్తున్నారు. నాకది ఏమాత్రం నచ్చడం లేదు. అందుకే అలాంటి ఆఫర్లను తిరస్కరిస్తున్నాను. రజనీకాంత్‌ దర్బార్‌లోనూ నెగెటివ్‌ రోల్‌ చేశాను. కాకపోతే రజనీ సర్‌తో కలిసి నటించాలన్న ఏకైక కోరికతోనే ఆ సినిమా ఒప్పుకున్నాను. 

కంటెంటే కింగ్‌
ఈ మధ్యే 'జై' అనే తుళు సినిమా చేశాను. ప్రాంతీయ సినిమాలను ఎంకరేజ్‌ చేయాలన్న ఉద్దేశంతోనే అందులో యాక్ట్‌ చేశా.. ఆ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఈ రోజుల్లో సినిమాకు భాషా సరిహద్దులంటూ లేవు. కంటెంట్‌ ఒక్కటే కింగ్‌. కంటెంట్‌ బాగుందంటే అది అన్ని హద్దులు దాటుకుని విజయజెండా ఎగరేస్తుంది అని చెప్పుకొచ్చాడు. సునీల్‌ శెట్టి చివరగా కేసరి వీర్‌, నడానియన్‌ సినిమాల్లో కనిపించాడు. ప్రస్తుతం వెల్‌కమ్‌ టు ద జంగిల్‌, హెరా ఫెరి 3 మూవీస్‌ చేస్తున్నాడు. ఈయన తెలుగులో మోసగాళ్లు, గని సినిమాలు చేశాడు.

చదవండి: తనూజతో అతి చేసిన యావర్‌.. చివరి కెప్టెన్‌ ఎవరంటే?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)