Breaking News

నువ్వు లేకుండా జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా: అతియా ఎమోషనల్‌

Published on Sat, 06/07/2025 - 18:48

మనకెంతో ఇష్టమైనవారిని కోల్పోతే ఆ బాధ తట్టుకోలేం. వాళ్లిక మనముందుకు ఎప్పటికీ రాలేరన్న నిజాన్ని జీర్ణించుకోలేం. ప్రస్తుతం అలాంటి బాధనే అనుభవిస్తోంది హీరోయిన్‌ అతియా శెట్టి (Athiya Shetty). తను ఎంతో ప్రేమగా చూసుకునే పెంపుడు కుక్క బ్రోడీ కన్నుమూసింది. దీంతో భావోద్వేగానికి లోనైన అతియా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. మై బ్రోడీ.. నువ్వు లేకుండా ఇంటిని, ఈ జీవితాన్ని ఊహించలేకపోతున్నాను. నా చిన్నతనంలో నాకు తోడుగా ఉన్నందుకు థాంక్యూ.. అని రాసుకొచ్చింది.

మాటల్లో చెప్పలేకపోతున్నా..
అతియా సోదరుడు, నటుడు అహాన్‌ (Ahan Shetty) సైతం బ్రోడీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. నీకు వీడ్కోలు పలకాలంటే మనసు భారంగా ఉంది. నా జీవితంలో అతి ముఖ్యమైన సమయాల్లో నువ్వు నావెంటే ఉన్నావు. నువ్వు నాకెంత ఇష్టమనేది మాటల్లో చెప్పలేకపోతున్నాను. నువ్వు నాకు తోడుగా ఉన్నావ్‌.. ఒక తమ్ముడిలా నిలబడ్డావ్‌.. యు వర్‌ మై హార్ట్‌. నీకు గుడ్‌బై చెప్పడం ఎంతో కష్టంగా ఉంది. ఎంతగానో మిస్‌ అవుతాను బ్రోడీ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టాడు. అటు సునీల్‌ శెట్టి సైతం.. రిప్‌ మై బేబీ అని బాధపడ్డాడు.

సినిమా..
బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి (Suniel Shetty)కి కూతురు అతియా శెట్టి, కుమారుడు అహాన్‌ సంతానం. హీరో, ముబాకరన్‌, మోతీచూర్‌ చక్నాచూర్‌ సినిమాలతో మెప్పించిన అతియా.. 2023లో క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ను పెళ్లాడింది. వీరికి ఈ మధ్యే పాప పుట్టింది. అహాన్‌.. తడప్‌ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం బోర్డర్‌ 2, సంకి చిత్రాల్లో నటిస్తున్నాడు.

 

 

చదవండి: 'ఢీ'.. దిల్‌రాజు సహా ఎవరూ కొనలేదు: మంచు విష్ణు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)