Breaking News

నవ్వులు గట్టిగా వినిపిస్తాయి: సందీప్‌ కిషన్‌

Published on Mon, 02/24/2025 - 00:03

సందీప్‌ కిషన్(Sundeep Kishan), రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘మజాకా’(Mazaka). రావు రమేశ్, అన్షు ఇతర లీడ్‌ రోల్స్‌లో నటించారు. అనిల్‌ సుంకర ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్‌ పతాకాలపై నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రాజేశ్‌ దండా, ఉమేష్‌ కేఆర్‌ బన్సల్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఆదివారం ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో హీరో సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ– ‘‘మజాకా’ సినిమాకు థియేటర్స్‌లో నవ్వులు గట్టిగా వినిపిస్తాయి.

నా కెరీర్‌లో హయ్యెస్ట్‌ నంబర్స్‌ ఈ సినిమా ఇస్తుందనే నమ్మకం ఉంది. ఫ్యామిలీతో థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా ఇది. నాకు, రావు రమేశ్‌గారికి ఈక్వెల్‌ స్క్రీన్‌ స్పేస్‌ ఉంది. ఆయన వల్ల కథ మరింతగా పండింది’’ అన్నారు సందీప్‌ కిషన్‌. ‘‘ఇద్దరు మగవాళ్లు మాత్రమే ఉన్న ఒక ఇంట్లో ఏ రోజుకైనా ఒక ఫ్యామిలీ ఫొటో రావాలని పడే తపనే ఈ సినిమా కథ. నా ప్రతి సినిమాలో ఉండే మ్యాజిక్‌ ఈ సినిమా లోనూ ఉంటుంది. ఈ సినిమా డబుల్‌ బ్లాక్‌బస్టర్‌ అవుతుంది’’ అన్నారు నక్కిన త్రినాథరావు.

‘‘ఈ చిత్రంలో రొమాంటిక్‌గా నటించడం చాలా సవాల్‌గా అనిపించింది. కొత్తగా నవ్వించే చాన్స్‌ ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు రావు రమేశ్‌. ‘‘కెప్టెన్‌ మిల్లర్, భైరవకోన, రాయన్‌’ ఇప్పుడు ‘మజాకా’... ఇలా డిఫరెంట్‌ సినిమాలతో అలరిస్తున్న సందీప్‌ కిషన్‌కు పీపుల్స్‌ స్టార్‌ అనే ట్యాగ్‌ యాప్ట్‌ అనిపించింది’’ అన్నారు అనిల్‌ సుంకర. ‘‘సందీప్, రావు రమేశ్‌గార్లు పొటీపడి నటించారు. ‘మజాకా’ అందరికీ నచ్చుతుంది. ‘సామజ వరగమన, భైరవ కోన’ చిత్రాల తర్వాత అనిల్‌గారు, నేను హ్యాట్రిక్‌ సినిమాతో వస్తున్నాం’’ అన్నారు రాజేశ్‌ దండా. హీరోయిన్‌ రీతూ వర్మ, అన్షు మాట్లాడారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)