Breaking News

సందీప్‌ కిషన్‌ మంచి మనసు.. వారి కోసం నెలకు రూ. 4 లక్షలు

Published on Thu, 07/25/2024 - 07:13

టాలీవుడ్‌ యంగ్‌ హీరోలలో సందీప్‌ కిషన్‌ చాలా ప్రత్యేకమనే చెప్పవచ్చు.. సినిమాలతో పాటు హోటల్‌ రంగంలోనూ రాణిస్తున్నాడు. ప్రతిరోజూ పేదలకు ఆహారం అందిస్తూ తన మంచి మనసు చాటుకుంటున్నాడు. సినిమా రంగంలో  అపజయాలు ఎదురైనా తన పంతాను మార్చుకుంటూ మళ్లీ విజయం సాధిస్తాడు. తమిళ్‌లో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. అక్కడ ఆయనకంటూ ప్రత్యేకమైన మమార్కెట్‌ను   క్రియేట్‌ చేసుకున్నాడు. ఈ క్రమంలో కోలీవుడ్‌ హీరో ధనుష్‌తో కెప్టెన్‌ మిల్లర్, రాయన్‌ సినిమాల్లో లీడ్‌ రోల్స్‌ చేశాడు.

చాలా మంది సినీ సెలబ్రిటీలు తమకు తోచిన విధంగా సాయం చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో  కొన్ని వారు చెప్పే వరకు అభిమానులకు కూడా తెలియదు. వారు చేస్తున్న మంచి పనిని గోప్యంగానే ఉంచుతారు. తాజాగా హీరో సందీప్ కిషన్ రాయన్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా ముందుకు వచ్చారు. ఆ సమయంలో తను నిర్వహిస్తున్న రెస్టారెంట్ల నుంచి ప్రతిరోజు 350 మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆశ్రమాలతో పాటు రోడ్‌ సైడ్‌ ఉండే పేదలకు రెస్టారెంట్ ద్వారా ఆహారం పంచుతున్నట్లు తెలిపారు. దీంతో నెలకు రూ. 4 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని సందీప్‌ తెలిపారు.

భవిష్యత్‌లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తక్కువ ధరకే క్యాంటీన్స్ పెట్టాలనే ఆలోచన  ఉన్నట్లు సందీప్‌ కిషన్‌ తెలిపాడు. ప్రస్తుతం ఈ అంశం గురించి తన టీమ్‌ పరిశీలిస్తుందని చెప్పారు. దీంతో ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. నెటిజన్లు కూడా సందీప్‌ను ప్రశంసిస్తున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)