Breaking News

సుకుమార్‌ నేషనల్‌ అయితే.. కూతురు ఇంటర్నేషనల్

Published on Thu, 01/02/2025 - 07:20

పుష్ప సినిమాతో దర్శకుడు సుకుమార్‌ పేరు దేశవ్యాప్తంగా వైరల్‌ అవుతూనే ఉంది. ఇప్పుడు ఆయన కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి కూడా ఇంటర్నేషనల్  వేదికలపై సత్తా చాటుతుంది. ఆమె  ప్రధాన పాత్రధారిగా నటించిన 'గాంధీ తాత చెట్టు' ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అవార్డ్స్‌ను అందుకుంది. ఇప్పుడు తెలుగులో జనవరి 24న విడుదల కానుంది.

పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని  సుకుమార్‌ రైటింగ్స్, గోపీటాకీస్‌ సంస్థలతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మించారు. ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ భార్య, శ్రీమతి తబితా సుకుమార్‌ సమర్పకురాలుగా వ్యవహరించారు. ఇప్పటికే ఈ 'గాంధీ తాత చెట్టు' సినిమా పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించడమే కాకుండా ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి  పురస్కారం కూడా పొందారు. దీంతో పుష్ప అభిమానులు సుకుమార్‌ కూతురు అనిపించుకున్నావ్‌ అంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు. తండ్రి నేషనల్‌ అయితే, కూతురు ఇంటర్నేషనల్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

ఈ సినిమా గురించి దర్శకురాలు మాట్లాడుతూ.. 'గాంధీజీ సిద్ధాంతాల్ని పాటిస్తూ.. ఓ పదమూడేళ్ల అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తన గ్రామాన్ని కాపాడుకునేందుకు ఆ అమ్మాయి ఏం చేసిందనేది ఈ చిత్రంలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నేటి తరం తల్లిదండ్రులు అందరూ  తమ పిల్లలకి ఈ చిత్రాన్ని తప్పనిసరిగా చూపించాలని దర్శకురాలు కోరారు. సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో  ఆఆనంద్‌ చక్రపాణి, రఘురామ్, భాను ప్రకాశ్‌ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)