Breaking News

ఏ అమ్మాయి ఆ పని చేయదంటూ ఏడ్చేసిన తబిత.. ఓదార్చిన సుకుమార్‌

Published on Fri, 01/17/2025 - 13:08

ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ (Sukumar) కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి (Sukriti Veni Bandreddi) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం గాంధీ తాత చెట్టు. ఇప్పటికే ఈ సినిమా పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ఎన్నో అవార్డులను అందుకుంది. గురువారం నాడు ఈ సినిమా రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఎన్నోసార్లు ఏ‍డ్చానంటూ మళ్లీ ఎమోషనల్‌
సందర్భంగా తబిత మాట్లాడుతూ ఎమోషనలైంది. 'సుకృతి పాటలు పాడగలదు. కానీ తనకు యాక్టింగ్‌ రాదని చాలా భయపడ్డాను. డైరెక్టర్‌ మాత్రం సుకృతిని నమ్మి సినిమాలోకి తీసుకొచ్చింది. తనలోని టాలెంట్‌ను నేనెప్పుడూ గమనించలేదు. ఈ సినిమా పూర్తయ్యాక ఎన్నిసార్లు చూశానో.. అన్నిసార్లు ఏడుస్తూనే ఉన్నాను. ఇక్కడ నా కూతురు గురించి చెప్పాలి.. ఈ సినిమా చేసేటప్పుడు తను 13వ వయసులోకి అడుగుపెట్టింది. 

గర్వంగా ఉంది: తబిత
ఈ ఏజ్‌లో ఏ అమ్మాయి గుండు చేయించుకోవడానికి ఇష్టపడదు.. కానీ గాంధీ తాత చెట్టు సినిమా (Gandhi Tatha Chettu) కోసం తను గుండు గీయించుకుంది. ఆ విషయంలో తనను చూసి గర్విస్తున్నాను' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో సుకుమార్‌ స్టేజీపైకి వెళ్లి తనను ఓదార్చాడు. అనంతరం సుకృతి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. నా చుట్టూ ఉన్నవాళ్లు పుష్ప మూవీలో నటిస్తున్నావా? అని అడుగుతూ ఉండేవారు. 

పుష్ప మూవీలో యాక్ట్‌ చేస్తానన్నా
సుకుమార్‌ కూతుర్ని కాబట్టే నన్ను సినిమాలో తీసుకున్నాడు అన్న పేరు నాకిష్టం లేక నేను చేయలేదని చెప్పాను. కానీ అసలు నిజమేంటో తెలుసా? పుష్ప 1, పుష్ప 2 సినిమాల్లో నేను యాక్ట్‌ చేస్తానని నాన్నను అడిగాను. ముందు ఆడిషన్‌ చేయు.. తర్వాత చూద్దామన్నాడు. అందుకే చేయలేదు. అని చెప్పుకొచ్చింది.

గాంధీ తాత చెట్టు
గాంధీ తాత చెట్టు సినిమా విషయానికి వస్తే.. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించారు. సుకుమార్‌ సతీమణి తబిత సమర్పకురాలిగా వ్యవహరిస్తుండగా సుకుమార్‌ రైటింగ్స్, గోపీటాకీస్‌ సంస్థలతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మించారు. ఈ మూవీ జనవరి 24న థియేటర్లలో విడుదల కానుంది.

చదవండి: సైఫ్‌ అలీ ఖాన్‌పై దాడికి పాల్పడిన నిందితుడు అరెస్ట్‌

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)