Breaking News

ఫిల్మ్‌నగర్‌ బాధలు తెలుసు: సుధీర్‌బాబు

Published on Mon, 11/03/2025 - 00:25

‘‘ఒక్క సినిమా చాలు అనుకున్న నేను 20 సినిమాలు చేశాను. వీటిలో హిట్‌ చిత్రాలకు కారణం నా కష్టమైతే ఫెయిల్యూర్స్‌కి కారణం కూడా నేనే. మహేశ్‌గారు హెల్ప్‌ చేయడానికి రెడీగా ఉన్నా, నేను అడగలేదు. నేను ఇరవై సినిమాలు చేయడానికి కారాణం ఒక్కటే. కృష్ణగారి అల్లుడు, మహేశ్‌గారి బావ... సుధీర్‌బాబు. అయితే నా యాక్షన్‌ వీడియోలు పట్టుకుని ప్రతి ఆఫీస్‌కి తిరిగాను. నాకు కృష్ణానగర్‌ కష్టాలు తెలియకపోవచ్చు కానీ ఫిల్మ్‌నగర్‌ బాధలు తెలుసు. అవకాశాల కోసం బస్సులో నేను ట్రావెల్‌ చేయకపోవచ్చు. కానీ కారులో కూర్చుని ఏడవడం తెలుసు.

ఇవన్నీ నేను సింపతీ కోసం చెప్పట్లేదు. మీరందరూ (వేడుకలో వీక్షకులను ఉద్దేశిస్తూ..) మహేశ్‌బాబుగారిపై ప్రేమతోనే వచ్చారు. థ్యాంక్యూ సో మచ్‌. కానీ ఇందులో ఎవరో ఒకరు ఏదో మూలన నాకోసం వచ్చి ఉంటారని, నా కోసం చప్పట్లు కొట్టి ఉంటారని నా మనసుకు తెలుస్తోంది. నేను మరింత కష్టపడతాను’’ అని హీరో సుధీర్‌బాబు అన్నారు. సుధీర్‌బాబు, సోనాక్షి సిన్హా లీడ్‌ రోల్స్‌లో, శిల్పా శిరోద్కర్‌ కీ రోల్‌లో నటించిన చిత్రం ‘జటాధర’.

ఈ ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రానికి వెంకట్‌ కల్యాణ్, అభిషేక్‌ జైస్వాల్‌ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్‌ కుమార్‌ బన్సల్, శివిన్‌ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్‌ నందా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘నేను చేసిన 20 సినిమాల్లో ‘జటాధర’ బెస్ట్‌ స్క్రిప్ట్‌. ఇందులో ఘోస్ట్‌ హంటర్‌ క్యారెక్టర్‌ చేశాను. ఈ సినిమా కోసం శివ తాండవం చేయడం అద్భుతమైన అనుభూతి. ఇది ఆ శివుని దీవెనగా భావిస్తున్నాను’’ అని తెలిపారు. ‘‘ఈ సినిమా ఆడియన్స్‌కు నచ్చుతుంది’’ అని పేర్కొన్నారు శివిన్, ప్రేరణ.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)