Breaking News

కాస్టింగ్‌ కౌచ్‌.. ఓ గొప్ప ఫిలింమేకర్‌ కాంప్రమైజ్‌ అడిగాడు: నటుడు

Published on Thu, 06/26/2025 - 12:38

అడ్జస్ట్‌ అయితేనే అవకాశాలు ఇస్తామంటున్నారు అని ఎంతోమంది నటీమణులు మీడియా ముందు గోడు వెల్లబోసుకున్నారు. అయితే తనకూ అలాంటి పరిస్థితే ఎదురైందంటున్నాడు బాలీవుడ్‌ నటుడు సుధాన్షు పాండే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుధాన్షు పాండే మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ ఉంది. నేను కూడా ఆ ఇబ్బందులను ఎదుర్కొన్నాను. ఓ ప్రముఖ దర్శకనిర్మాత తను అడిగింది చేస్తే మంచి ఆఫర్‌ ఇస్తానన్నాడు.

కాంప్రమైజ్‌ అయితేనే..
ఇప్పుడాయన బతికి లేడు. గొప్ప ఫిలింమేకర్స్‌లో ఆయన ఒకరు. ఆయన అడిగినదానికి కాంప్రమైజ్‌ అయితేనే రోల్‌ ఇస్తానన్నాడు. ఆయనపై నాకెలాంటి కోపం, పగ లేదు. ఎందుకంటే వాళ్లు అడిగినదానికి ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. ఆయన అడిగింది నా వల్ల కాదని సున్నితంగా తిరస్కరించాను. మర్యాదగా అడిగాడు కాబట్టి అంతే గౌరవంగా బదులిచ్చాను. 

బలవంతం చేస్తే నచ్చదు
అలా కాకుండా నాతో అసభ్యంగా ప్రవర్తించుంటే లాగిపెట్టి కొట్టేవాడిని. ఎవరైనా నన్ను బలవంతం చేస్తే నాకు చాలా కోపం వస్తుంది. నాకు నచ్చినపనే చేస్తాను. నచ్చినవాటివైపే నిలబడతాను. ఇష్టం లేకుండా ఏ పనీ చేయను అని చెప్పుకొచ్చాడు. సుధాన్షు పాండే.. ఖిలాడీ 420, ద మిత్‌, యాకీన్‌, మర్డర్‌ 2, రాజధాని ఎక్స్‌ప్రెస్‌ వంటి పలు చిత్రాలు చేశాడు. రోబో 2.0, మన్మథుడు 2 వంటి చిత్రాలతో తెలుగువారికీ సుపరిచితుడే.. ప్రస్తుతం ప్రైవేట్‌ సాంగ్స్‌లో కనిపిస్తున్నాడు.

చదవండి: లయ కూతుర్ని చూశారా? ఎంత పెద్దగా అయిపోయిందో!

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)