Breaking News

పలు సవాళ్లు.. అన్నీ దాటుకుని సినిమా తీశా: సుధా కొంగర

Published on Fri, 01/09/2026 - 07:02

శివకార్తికేయన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం పరాశక్తి. శ్రీలీల హీరోయిన్‌. రవిమోహన్‌ ప్రతినాయకుడిగా, అధర్వ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సుధా కొంగర దర్శకత్వంలో నిర్మాత ఆకాశ్‌ భాస్కర్‌ తన డాన్‌ పిక్చర్స్‌ పతాకంపై నిర్మించారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతాన్ని అందించిన ఈ మూవీ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శనివారం తెరపైకి రానుంది.

 స్క్రీన్‌ప్లే రాయడమే ఛాలెంజింగ్‌
ఈ సందర్భంగా దర్శకురాలు సుధా కొంగర మాట్లాడుతూ.. పరాశక్తి సినిమా కథ రాసినప్పుడు పలువురి నుంచి అభినందనలు, అదే సమయంలో కథ గురించి పలు సందేహాలు తలెత్తాయన్నారు. ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే రాయడమే ఛాలెంజింగ్‌గా మారిందన్నారు. అదే విధంగా సినిమా రిలీజ్‌ తర్వాత పలు విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పలువురూ హెచ్చరించారన్నారు. 

అసాధ్యాలను సుసాధ్యం చేయాలని 
అయితే దర్శకుడు మణిరత్నంలాగా ధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేయాలని భావించి.. పలు సవాళ్లను ఎదుర్కొని ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు. ఈ సినిమాను నమ్మిన నిర్మాత ఆకాశ్‌ భాస్కర్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నటీనటులతో పాటు, సాంకేతిక వర్గం ఈ సినిమాకోసం ఎంతో శ్రమించారని పేర్కొన్నారు. పరాశక్తి తమిళ చిత్రపరిశ్రమలో ప్రత్యేక సినిమాగా నిలిచిపోతుందనే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)