Breaking News

శింబుతో జతకట్టనున్న ఇద్దరు హీరోయిన్స్‌!

Published on Fri, 01/26/2024 - 10:04

తమిళ హీరో శింబు నటించిన చివరి చిత్రం పత్తుతల. ఈ చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. దీంతో ఈయన తర్వాత చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని ఆయన అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. శింబు కథానాయకుడిగా కమల్‌ హాసన్‌ ఒక చిత్రాన్ని నిర్మించనున్నట్లు చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి దేశింగు పెరియసామి దర్శకత్వం వహించనున్నారట. ఈయన చెప్పిన కథ రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ వంటి ప్రముఖ స్టార్స్‌ను మెప్పించిందని, ఇందులో రజనీ నటించాల్సిందని ప్రచారం జరిగింది.

హీరో, విలన్‌.. అన్నీ ఒక్కడే
అలాంటి కథలో ఇప్పుడు శింబు నటించనున్నారు. ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఈ చిత్రం కోసం శింబు కరాటే వంటి విద్యల్లో శిక్షణ పొందడం విశేషం. ఇది పీరియాడికల్‌ కథా చిత్రంగా ఉంటుందని టాక్‌. ఈ మూవీలో శింబు హీరో, విలన్‌ పాత్రను తనే పోషించనున్నారని టాక్‌! ఇకపోతే ఈ చిత్రంలో బాలీవుడ్‌ మోస్ట్‌ టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న దీపికాపదుకొనే, కీర్తీసురేశ్‌ హీరోయిన్లుగా నటించనున్నట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

బాలీవుడ్‌ క్వీన్‌తో..
హీరోకు జంటగా కీర్తీసురేశ్‌, విలన్‌ సరసన దీపికా పదుకొనే నటించబోతున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే ఇది నిజంగానే భారీ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రమవుతుంది. దీపికా పదుకొనే చాలా గ్యాప్‌ తరువాత మరోసారి కోలీవుడ్‌ ప్రేక్షకులను ఈ చిత్రం ద్వారా పలకరించనున్నారన్నమాట. ఈ చిత్ర టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్లను ఫిబ్రవరి మూడో వారంలో విడుదల చేయడానికి యూనిట్‌ వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

చదవండి: ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది: మెగాస్టార్ ఎమోషనల్

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)