Breaking News

స్టార్ హీరో చిత్రాన్ని తొలగించిన ప్రముఖ ఓటీటీ సంస్థ.. ఎందుకంటే?

Published on Thu, 01/25/2024 - 18:09

కన్నడ దివంగత స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్‌ పరిచయం అక్కర్లేని పేరు. అయితే ఆయన కెరీర్‌లో చివరిసారిగా నటించిన చిత్రం గంధడ గడ. డాక్యుమెంటరీగా రూపొందించిన ఈ సినిమా అప్పట్లో థియేటర్లలో రిలీజై ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఈ చిత్రం మొదట అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఆ తర్వాత లైసెన్స్ గడువు ముగియడంతో తమ ఫ్లాట్‌ఫామ్‌ నుంచి అమెజాన్ ఈ మూవీని తొలగించింది. దీంతో పునీత్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు.

(ఇది చదవండి: పునీత్‌ రాజ్‌కుమార్‌ రెండో వర్థంతి.. కన్నీరు పెడుతున్న ఫ్యాన్స్‌)

అయితే అమెజాన్‌లో తొలగించినా.. గంధడ గడ మూవీ మరికొన్ని డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం యూట్యూబ్, గూగుల్ టీవీ, ఐట్యూన్స్, యాపిల్ టీవీల్లో రెంట్‌ విధానంలో అందుబాటులో ఉంది. ఎవరైనా ఈ సినిమాను వీక్షించాలనుకుంటే...రూ.100 అద్దె చెల్లించి చూసేయొచ్చు.  ఈ డాక్యుమెంటరీని కర్ణాటక రాష్ట్ర అడవులు, ప్రకృతి వనరులు, జీవ వైవిధ్యంలోని గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కించారు. ఈ డాక్యూమెంటరీ ఫిల్మ్‌ లో నటిస్తూనే స్వయంగా నిర్మించారు పునీత్ రాజ్‌కుమార్‌.

కాగా.. పునీత్‌ రాజ్‌కుమార్‌ 2021 అక్టోబరు 29న వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించిగా చికిత్స పొందుతూ మరణించాడు. ఆయనకు భార్య అశ్వనీ రేవంత్, ఇద్దరు కుమార్తెలు ధ్రితి, వందిత ఉన్నారు. ఆయన మరణానంతరం మైసూరు విశ్వవిద్యాలయం  గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది.  కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ చేతులమీదుగా ఆయన సతీమణి అశ్విని 2022 మార్చి 22న డాక్టరేట్‌ స్వీకరించింది.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు