Breaking News

ప్రియదర్శికి స్టార్ హీరో దంపతుల సర్‌ప్రైజ్‌.. ఇంతకీ అదేంటంటే?

Published on Sat, 04/26/2025 - 11:13

టాలీవుడ్ హీరో ప్రియదర్శి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవలే కోర్ట్‌ మూవీతో సక్సెస్ అందుకున్న ప్రియదర్శి మరో మూవీతో ప్రేక్షకులు ముందుకొచ్చారు. మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్‌లో వచ్చిన సారంగపాణి జాతకం ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే సక్సెస్‌ టాక్ రావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.

ఇదిలా ఉండగా కోర్ట్‌ మూవీలో ప్రియదర్శి లాయర్ పాత్రలో అభిమానుల ముందుకొచ్చారు. ఈ పాత్రలో తనదైన నటనతో అందరినీ కట్టిపడేశారు. ఈ మూవీపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ మూవీలో ప్రియదర్శి నటనపై కోలీవుడ్ స్టార్ దంపతులు సైతం ఫిదా అయ్యారు.  తాజాగా సూర్య, జ్యోతిక జంట ప్రియదర్శి నటనను కొనియాడారు. ప్రియదర్శికి ఓ ఫ్లవర్‌ బొకేతో పాటు చిన్న లెటర్‌ను పంపించారు. ఈ విషయాన్ని ప్రియదర్శి ట్విటర్‌లో షేర్ చేశారు.

ప్రియదర్శి తన పోస్ట్‌లో రాస్తూ.. 'మీరు పంపిన సందేశం, పువ్వులు అందుకోవడం నా హృదయాన్ని తాకింది. ఈ ఫీలింగ్‌ను మాటల్లో చెప్పలేను. ఇద్దరు న్యాయవాదులు చంద్రు, వెంబా వెనక నుంచి గర్వంగా తట్టినట్లుగా అనిపించింది. నన్ను బాగా ప్రేరేపించిన ఆ ఇద్దరికీ చాలా ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. కాగా..కోర్ట్ మూవీలో  జూనియర్‌ లాయర్‌ సూర్యతేజ పాత్రలో ప్రియదర్శి కనిపించారు.
 

 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు