Breaking News

'వార్‌2'లో గాయపడిన స్టార్‌ హీరో.. సినిమా వాయిదా..!‌

Published on Tue, 03/11/2025 - 08:32

'వార్‌2' విడుదల కోసం పాన్‌ ఇండియా రేంజ్‌లో అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ వార్త వారిని కాస్త ఇబ్బందిపెట్టొచ్చు. హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే, తాజాగా తారక్‌, హృతిక్‌ రోషన్ మధ్య ఒక సాంగ్‌ను మేకర్స్‌ ప్లాన్‌ చేశారట. ఈ పాట రిహార్సల్స్‌ చేస్తున్నప్పుడు హృతిక్‌ గాయపడినట్లు బాలీవుడ్‌లో వార్తలు వైరల్‌ అవుతున్నాయి. దీంతో ఆయన అభిమానులతో పాటు తారక్‌ ఫ్యాన్స్‌ కూడా ఆందోళన చెందుతున్నారు.

హృతిక్‌ రోషన్‌–ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ఇప్పటికే కొన్ని భారీ యాక్షన్‌ సీన్స్‌ కూడా చిత్రీకరించారు. అయితే, తాజాగా ఫైనల్‌ సాంగ్‌ కోసం షెడ్యూల్‌ను మేకర్స్‌ ఏర్పాటు చేసుకున్నారు. అందుకోసం ముంబయిలోని యశ్‌రాజ్‌ స్టూడియోస్‌లో భారీ సెట్‌ను వేశారట. ఈ పాటలో వారిద్దరితో పాటు  దాదాపు 500మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో హృతిక్‌ గాయపడటంతో షూటింగ్‌ను ఆపేశారట.  ప్రస్తుతం ఆయన ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తోంది.  వైద్యుల సూచనల మేరకు నెల రోజులు రెస్ట్‌ తీసుకోనున్నట్లు బాలీవుడ్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.  ఈ ఏడాది ఆగష్టు 14న ఈ చిత్రం విడుదల చేస్తామని మేకర్స్‌ ప్లాన్‌ చేసుకున్నారు. ఈ ఘటనతో వార్‌2 మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై చిత్ర యూనిట్‌ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

‘వైఆర్‌ఎఫ్‌’ (యశ్‌రాజ్‌ ఫిలింస్‌) స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ సినిమాను ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. 2019లో విడుదలైన హిట్‌ మూవీ ‘వార్‌’ కి సీక్వెల్‌గా ‘వార్‌ 2’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో జాన్‌ అబ్రహాం, కియారా అద్వానీ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు