Breaking News

రాజమౌళి సైలెంట్.. హీరోయిన్ మాత్రం తగ్గట్లే

Published on Sat, 08/30/2025 - 20:30

స్టార్ డైరెక్టర్ రాజమౌళి.. ప్రస్తుతం మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఉందని అందరికీ తెలుసు. కానీ రాజమౌళి ఒక్కటంటే ఒక్క మాట బయటపడకుండా జాగ్రత్త పడుతున్నాడు. అటు మహేశ్ బాబు కూడా పిన్ డ్రాప్ సైలెంట్ అనేలానే ఉన్నాడు. మిగతా టీమ్ అంతా కూడా ఒక్క ఫొటో కూడా పోస్ట్ చేయట్లేదు. కానీ హీరోయిన్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఫొటోలు పోస్ట్ చేస్తూనే ఉంది. తాజాగా ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.

రాజమౌళి-మహేశ్ బాబు సినిమాకు 'SSMB29' అనే వర్కింగ్ టైటిల్ నిర్ణయించారు. ఇందులో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా చేస్తోంది. షూటింగ్ జరిగిన ప్రతిసారి ఆ ప్రాంత ఫొటోలని ఈమె పోస్ట్ చేస్తూనే ఉంది. కొన్ని నెలల క్రితం ఒడిశాలో షూటింగ్ జరగ్గా.. అప్పుడు కూడా ఆయా ప్రాంతంలో తీసుకున్న కొన్ని ఫొటోల్ని ప్రియాంక పోస్ట్ చేసింది. ఇప్పుడు టీమ్ అంతా కెన్యాలో చిత్రీకరణ చేస్తోంది. అక్కడ పర్యావరణ అందాల్ని తన కెమెరాలో బంధించిన ఈ బ్యూటీ.. పలు ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో మహేశ్ ఫ్యాన్స్‌కి షూటింగ్ అప్డేట్ ఇచ్చినట్లయింది.

(ఇదీ చదవండి: హీరో అసభ్య ప్రవర్తన.. నేను ఎంజాయ్‌ చేయలేదు, ఏడ్చా.. ఇండస్ట్రీకో దండం!) 

చాలా ఏ‍ళ్ల క్రితమే రాజమౌళి.. కెన్యా వెళ్లి వచ్చాడు. అప్పుడు లొకేషన్ల కోసం కాగా ఇప్పుడు షూటింగ్ జరుగుతోంది. అయితే ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఏదైనా లుక్, పోస్టర్ లాంటిది వస్తుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ నవంబర్‌లోనే అఫీషియల్ పోస్టర్ వస్తుందనే అప్‌డేట్ లాంటిది ఆ రోజున ప్రకటించారు. ఇప్పుడు కెన్యాలో ఎలాంటి సౌండ్ లేకుండా షూటింగ్ చేసుకుంటున్నారు. గత చిత్రాలతో పోలిస్తే రాజమౌళి ఈసారి భిన్నంగా ప్రవర్తిస్తుండటం విశేషం.

ఇకపోతే ఈ మూవీ గ్లోబ్ ట్రాటెర్ కాన్సెప్ట్ అని చాన్నాళ్ల క్రితమే చెప్పారు. అంటే ఈ స్టోరీలో హీరో ప్రపంచమంతా తిరుగుతుంటాడు. అడ్వెంచర్స్ చేస్తుంటాడు. మహేశ్ బాబుకి విలన్‌గా 'సలార్' ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. ఈ విషయం కూడా చాన్నాళ్ల క్రితం లీకైన ఓ వీడియో వల్ల బయటపడింది.

(ఇదీ చదవండి: ఎంగేజ్‌మెంట్‌తో మారిపోయా.. ఇకపై అలాంటి సీన్లు చేయను: విశాల్‌)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)