DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు
Breaking News
ఆ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: ఎస్ఎస్ రాజమౌళి
Published on Sat, 03/01/2025 - 15:51
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) తాజాగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ క్షణం కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. మార్చి 22వ తేదీ జరిగే అద్భుతమైన ప్రదర్శన కోసం వెయిట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకీ ఆ వివరాలేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
మార్చి 22వ తేదీన హైదరాబాద్ వేదికగా సంగీత దిగ్గజం ఎంఎం కీరవాణి(MM Keeravani) మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహిస్తున్నారని రాజమౌళి వెల్లడించారు. ఆ సంగీత ప్రదర్శన చూసేందుకు తాను కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నానని పేర్కొన్నారు. నా సినిమాలోని పాటలతో పాటు ఆయన చేసిన సాంగ్స్ కూడా ఈ ప్రదర్శనలో ఉంటాయని తెలిపారు. కేవలం పాటలు మాత్రమే కాకుండా.. ఓఎస్‌టీలు(ఒరిజినల్ సౌండ్ ట్రాక్) కూడా ప్రదర్శించాలని ఎంఎం కీరవాణి డిమాండ్ చేస్తున్నట‍్లు ట్విటర్ వేదికగా వీడియోను రిలీజ్ చేశారు.
కాగా.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబు సినిమా పనులతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ కోసం ఇప్పటికే షూటింగ్ లోకేషన్స్ కూడా ఫిక్స్ చేశారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచరస్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కీలక పాత్రలో కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Seeing all the singers share their playlists is making me excited for MMK’s live concert.
But what makes me have an edge-of-the-seat experience is imagining him performing the OSTs of our favorite films… Remember peddanna, we are here for the #FullFeastMMK!
Not just songs, we… pic.twitter.com/9dS8AeAbse— rajamouli ss (@ssrajamouli) February 28, 2025
Tags : 1