Breaking News

బాహుబలి రాకెట్‌ సక్సెస్‌.. గర్వంగా ఉందన్న రాజమౌళి

Published on Mon, 11/03/2025 - 15:32

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోసారి తన శక్తిని చాటుకుంది. బాహుబలి రాకెట్‌ (ఎల్‌వీఎం3-ఎం5)ను విజయవంతంగా ప్రయోగించింది. నవంబర్‌ 2న శ్రీహరి కోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఎల్‌వీఎం3-ఎం5 ద్వారా సీఎంఎస్‌-03 శాటిలైట్‌ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ పూర్తిగా భారతదేశంలో తయారుకావడం విశేషం. 

రాకెట్‌ సక్సెస్‌.. రాజమౌళి హర్షం
ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్‌ సుమారు 4,410 కేజీలు బరువుంది. ఇది భారత భూభాగంతో సహా సముద్ర ప్రాంతంలోనూ అన్ని వేళల్లో సేవలందిస్తుంది. ఈ ఉపగ్రహం దాదాపు 15 ఏళ్ళు పాటు పనిచేస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) హర్షం వ్యక్తం చేశాడు.

నిజంగా మాకు గర్వకారణం
అత్యంత బరువైన కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ CMS-03 విజయవంతమవడం ఆనందకరం. భారతదేశ శక్తిసామర్థ్యాలను అంతరిక్షంలోనూ చాటిచెప్తున్నందుకు గర్వంగా ఉంది. బాహుబలి.. ఈ పేరుకున్న బలం, దమ్ము అలాంటిది! ఇస్రో శాస్త్రవేత్తలు ఈ రాకెట్‌కు బాహుబలి అని పేరు పెట్టడం పట్ల మా బాహుబలి టీమ్‌ ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇది నిజంగా మాకు గర్వకారణం అని రాజమౌళి ట్వీట్‌ చేశాడు.

 

చదవండి: ఫ్యామిలీలో కొత్త మెంబర్‌.. బుల్లితెర జంట పోస్ట్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)