73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan
Breaking News
అప్పుడు బాహుబలి.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్.. రెండు చిత్రాలు మన దర్శకధీరుడివే!
Published on Thu, 05/22/2025 - 09:30
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది. ఇటీవల ఈ మూవీని లండన్‌లో ప్రముఖ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శించారు. ఈ ప్రత్యేక స్క్రీనింగ్‌కు రాజమౌళితో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా కుటుంబంతో కలిసి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.
అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. బాహుబలి తర్వాత ఆ ఘనతను దక్కించుకున్న చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. రాయల్ అల్బర్ట్ హాల్ స్థాపించి ఇప్పటి వరకు దాదాపు 154 ఏళ్లు పూర్తయింది. ఈ హాల్ స్థాపించాక ప్రదర్శించిన సినిమాల్లో ఇప్పటి వరకు కేవలం బాహుబలి మాత్రమే నాన్ ఇంగ్లీష్ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. 2019లో బాహుబలి మూవీని ఇదే హాల్‌లో ప్రదర్శించారు.
తాజాగా 2025లో ఆర్ఆర్ఆర్ ఈ ఘనతను సాధించింది. బాహుబలి తర్వాత ఈ రికార్డ్ సాధించిన రెండో నాన్ ఇంగ్లీష్ మూవీగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో టాలీవుడ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా దర్శకధీరుడికే దక్కుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌బాబుతో ఓ భారీ అడ్వెంచరస్ మూవీని తెరెకెక్కిస్తున్నారు. ఇటీవలే ఒడిశాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్‌లో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా కూడా పాల్గొంది. ప్రస్తుతం షూటింగ్‌కు విరామం లభించడంతో రాజమౌళి లండన్ కార్యక్రమానికి హాజరయ్యారు.
An SS Rajamouli Film… Does it again!! 🔥🌊
HistorRRRy continues at @RoyalAlbertHall!#RRRMovie is the second non-English film after Baahubali since its inauguration 154 years ago. ✊🏻 https://t.co/AJ9Od2mnD4 pic.twitter.com/FMf5UWHBKM— RRR Movie (@RRRMovie) May 21, 2025
Tags : 1