Breaking News

రాజమౌళి వారణాసి వాయిదా పడే ఛాన్స్.. అదే కారణమా?

Published on Thu, 11/26/2026 - 11:40

మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తోన్న మోస్ట్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఈ సినిమా ‍అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంపై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటోంది. ఈ మూవీ వాయిదా పడనుందని చాలాసార్లు వార్తలొచ్చాయి. కానీ ఎక్కడా కూడా అఫీషియల్‌ ప్రకటనైతే రాలేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7నే రిలీజ్ చేస్తామని మేకర్స్ ధీమాగా ఉన్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వారణాసి వాయిదా పడుతుందని మరోసారి టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. వీఎఫ్‌ఎక్స్‌పై దర్శకధీరుడు ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.  విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్-ప్రొడక్షన్ పనులను పూర్తి చేయడానికి అదనపు సమయం పట్టే ‍అవకాశముందని లేటేస్ట్ టాక్. రాజమౌళి ముఖ్యంగా  వీఎఫ్ఎక్స్ షాట్ల అవుట్‌పుట్‌ను సమీక్షించాకే రిలీజ్ తేదీపై ఫైనల్ డెసిషన్ తీసుకుంటారని సమాచారం. ఈ మూవీపై ఎలాంటి ట్రోల్స్‌కు తావులేకుండా అవుట్ పుట్ ఇవ్వాలనే ఆలోచనలో దర్శకధీరుడు ఉన్నారట.

ఈ కారణంతోనే వారణాసి మూవీ వాయిదా తప్పేలా కనిపించడం లేదు. దీనిపై పది రోజుల్లోనే మరింత క్లారిటీ వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలతో బిజీగా ఉంది వారణాసి టీమ్. డిసెంబరు తొలి వారం నుంచి డబ్బింగ్‌ పనులు మొదలు కానున్నట్లు తెలిపారు.  అయితే రిలీజ్‌ డేట్‌పై నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ప్రేక్షకులు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రాన్ని కేఎల్‌ నారాయణ, ఎస్‌.ఎస్‌.కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి. కీరవాణి సంగీతమందిస్తున్నారు.
 

Videos

5 రోజులుగా దూసుకెళ్తున్న 10 కొత్త కంపెనీలు.. ఇన్వెస్టర్లకు లాభాల పంట!

తెలుగు ఇండస్ట్రీపై విషం కక్కిన తాప్సీ

చెప్పులు మాత్రమే కొట్టేసే దొంగ

రెచ్చిపోయిన పరిటాల సునీతా అనుచరులు

నెలకు రూ. 10 వేలు పెడితే చాలు.. ఏకంగా రూ.55 లక్షలు

తలుపులు వేసుకొని మరీ రిగ్గింగ్ చేస్తున్నారు

YSRCP గోర్ల ఉపేంద్ర రెడ్డి అరెస్ట్ చేయాలనీ చూసిన పోలీసులకు చుక్కలు చూపించిన ప్రజలు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు

మిస్ యూనివర్స్ గా ఓ తల్లి.. చరిత్ర సృష్టించిన జెన్నిఫర్ !

ఓటు హక్కును వినియోగించుకున్న YS విమలమ్మ

Photos

+5

బ్లాక్‌ డ్రెస్‌లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ గ్లామర్.. (ఫోటోలు)

+5

'కూల్ రాకీ కూల్' సినిమా ఈవెంట్‌లో మెరిసిన ‘సౌమ్య జాను’ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నటి మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

ఏపీలో 'అభినవ తిరుపతి'ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘హైదరాబాద్‌ వాక్స్‌ ఫర్‌ నషాముక్త్‌ భారత్‌’ పాదయాత్ర (ఫోటోలు)

+5

అందమైన నవ్వుతో మీనాక్షి ఫొటోలు చూశారా?

+5

దుబాయ్‌లో కాజల్.. చెల్లితో సందడి (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీల్లో మెరిసిన అక్కినేని కోడలు శోభిత.. (ఫోటోలు)

+5

మిస్ యూనివర్స్ పోటీలు... కిరీటాన్ని గెలుచుకున్న జెన్నిఫర్ బారెటో (ఫోటోలు)

+5

భోగి మ్యూజికల్ ఈవెంట్‌లో డింపుల్ హయాతి గ్లామర్.. (ఫోటోలు)