Breaking News

ఆర్ఆర్ఆర్-2 చేస్తారా?.. రాజమౌళి సమాధానమిదే.. వీడియో వైరల్!

Published on Wed, 05/14/2025 - 21:07

ఆర్ఆర్ఆర్ టీమ్ లండన్‌లో సందడి చేస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్‌తో పాటు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం అక్కడే ఉన్నారు. తాజాగా లండన్‌లోని లెజెండరీ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మూవీ ప్రదర్శనతో పాటు ఆర్కెస్ట్రా కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆర్ఆర్ఆర్ ఫరెవర్ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.

మే 11న రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో 'ఆర్ఆర్ఆర్' సినిమాను ప్రదర్శించారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన రామ్ చరణ్, ఎన్టీఆర్‌ ఫుల్‌ ఖుషీగా కనిపించారు. నాటు నాటు సాంగ్‌ ప్లే అవుతుండగా ఒకరి చేతిని ఒకరు పట్టుకుని కనిపించారు. ఆ తర్వాత రాజమౌళిని రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ సరదాగా ఆట పట్టించారు. ముగ్గురు కలిసి నవ్వుతూ సందడి చేశారు. ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల, జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి ఉన్నారు.

ఈ సందర్భంగా ఉపాసన ఆర్ఆర్ఆర్-2 చేస్తారా? అంటూ రాజమౌళిని అడిగింది. దీనికి రాజమౌళి అవును అని సమాధానమిచ్చారు. ఉపాసన వెంటనే 'గాడ్‌ బ్లెస్‌ యూ' అంటూ వారిని దీవించింది. ఈ సరదా వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ ఈవెంట్‌లో ఆస్కార్  స్వరకర్త ఎంఎం కీరవాణి నేతృత్వంలోని రాయల్ ఫిల్హార్మోనిక్ కన్సర్ట్ ఆర్కెస్ట్రా ఆర్ఆర్ఆర్ సంగీతాన్ని ప్రదర్శించారు. దాదాపు మూడేళ్ల తర్వాత రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్‌ మొదటిసారి వేదికపై తిరిగి కలిశారు.

ఇక సినిమాల విషయానికొస్తే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో జతకట్టారు. ఈ సినిమా జూన్ 25, 2026న విడుదల కానుంది. మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సనా దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ మూవీ పెద్ది అనే టైటిల్ ఖరారు చేశారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. తొలిసారిగా మహేష్ బాబుతో కలిసి పనిచేయనున్నారు. ఈ చిత్రాన్ని 'ఎస్ఎస్ఎంబీ29' అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)