Breaking News

దర్శక దిగ్గజానికి దర్శకధీరుడు నివాళి

Published on Wed, 06/10/2026 - 15:46

దర్శక దిగ్గజం భారతీ రాజా మరణంపై దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ చేశారు. ఆయన తన సహజమైన, రాజీపడని కథనంతో సినీరంగంలో ఒక విప్లవం సృష్టించారని కొనియాడారు. మా అందరికీ నిజమైన మార్గదర్శిగా నిలిచారన్నారు. ఆ మరపురాని గ్రామీణ కథలు, ఆ నిర్భయమైన దృక్పథం, ఆయన తెరపైకి తీసుకువచ్చిన వాస్తవికత సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటాయని అన్నారు. ఆయన అసాధారణమైన కృషిని, వారసత్వాన్ని వీక్షించడం, స్మరించుకోవడం మనందరికీ గౌరవమని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా భారతీ రాజా మరణం పట్ల రాజమౌళి తన సంతాపం వ్యక్తం చేశారు.

కాగా.. వయో, అనారోగ్య సమస్యలతో దర్శక దిగ్గజం భారతీ రాజా కన్నుమూశారు. చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ అంతా షాకింగ్‌కు గురైంది. తమిళనాడు సీఎం విజయ్ సైతం ఎమోషనల్ అయ్యారు. భారతీరాజాకు నివాళులర్పిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పలువురు కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు భారతీ రాజాకు సంతాపం ప్రకటించారు. 
 

 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)