Breaking News

మహేశ్‌ బాబును ఇక్కడికి తీసుకొస్తాను: రాజమౌళి

Published on Tue, 03/19/2024 - 09:59

మహేశ్‌ బాబు-  రాజమౌళి కాంబోలో రానున్న బిగ్‌ ప్రాజెక్ట్‌ త్వరలో పట్టాలెక్కనుంది. తాజాగా ఇదే విషయాన్ని జక్కన్న తెలిపారు.  దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జపాన్‌లో ఉన్న రాజమౌళి SSMB29 సినిమాకు సంబంధించి అప్డేట్‌ ఇచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా ఆస్కార్‌ అవార్డుతో RRR గుర్తింపు తెచ్చుకుంది. తెలుగువారికి ఎంతో గర్వకారణంగా ఈ చిత్రం నిలిచింది. తాజాగా జపాన్‌లో ఈ మూవీ స్క్రీనింగ్‌కు రాజమౌళి హజరయ్యారు. అక్కడ మన జక్కన్న క్రేజ్‌ మామూలగా లేదు. ఆయనపై ఎనలేని అభిమానాన్ని అక్కడి ప్రజలు చూపించారు. ఈ క్రమంలో తన తర్వాతి ప్రాజెక్ట్‌ అయిన SSMB29 గురించి ఆయన మాట్లాడారు.

'మహేశ్‌ బాబుతో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. SSMB29 ప్రాజెక్ట్‌కు సంబంధించి కేవలం హీరోను మాత్రమే లాక్ చేశాం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరో మహేశ్‌ బాబు.. ఆయన తెలుగు వారు.. చాలా అందంగా ఉంటారు. బహుషా మీలో చాలామందికి ఆయన గురించి తెలిసే ఉంటుంది. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి జపాన్‌లో కూడా రిలీజ్‌ చేస్తాం.. ఆ సమయంలో మహేశ్‌ బాబుని కూడా ఇక్కడికి తీసుకొని వస్తాను.' అని జపాన్‌లో జక్కన్న వ్యాఖ్యానించారు. దీంతో మహేశ్‌ ఫ్యాన్స్‌ ఆయన మాటలను సోషల్‌ మీడియా ద్వారా తెగ షేర్‌ చేస్తున్నారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)