'లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌ అలా జరిగిపోయింది'.. శ్రియా శరణ్ ఆసక్తికర పోస్ట్

Published on Wed, 03/19/2025 - 20:05

టాలీవుడ్ హీరోయిన్ శ్రియా శరణ్ (Shriya Saran) తెలుగులో పలువురు స్టార్ హీరోల సరసన నటించింది. ఇష్టం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా మెప్పించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల సినిమాల్లో ప్రేక్షకుల్ని మెప్పించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ అభిమానులతో మాత్రం టచ్‌లోనే ఉంటోంది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

సోషల్ మీడియా వేదికగా తన భర్త అండ్రీ కొచ్చీవ్‌తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. తనతో సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం పరిచయం ఏర్పడిందని తెలిపింది. మార్చి 19న 2017లో మొదటిసారి అతన్ని కలుసుకున్నట్లు వెల్లడించింది. అనుకోకుండా ఓ రాంగ్‌ ఫ్లైట్‌.. ఓ డైవింగ్ ట్రిప్‌ వల్లే మేమిద్దరం ఒక్కటయ్యామని పేర్కొంది. అసలు మా ఇద్దరికీ ఎలా కుదిరిందో ఇప్పటికీ తెలియదని.. ప్రస్తుతం ప్రతిరోజు కలిసి నడుస్తున్నామని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. 2017 నుంచి 2025 వరకు తన భర్తతో ఉన్న మధురమైన జ్ఞాపకాలను పోస్ట్ చేసింది. అలాగే తన ముద్దుల కూతురితో దిగిన ఫోటోను కూడా పంచుకుంది.

కాగా.. శ్రియ శరన్‌ రష్యాకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను రహస్యంగా పెళ్లాడింది.  ముంబైలో అతికొద్ది మంది సమక్షంలో వీరి వివాహం జరిగింది. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులులతో పాటు సినీ ఇండస్ట్రీ నుంచి మనోజ్‌ బాజ్‌పేయి, షబానా అజ్మీలను మాత్రమే వివాహానికి హాజరయ్యారు.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)