నా పాత్రలో మరో నటుడిని తీసుకోవాలనుకున్నారు..కానీ..: శ్రీనాథ్

Published on Sun, 11/22/2026 - 18:47

'ఈ నగరానికి ఏమైంది 2' చిత్రం ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఈ సినిమాలో కార్తీక్‌ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు శ్రీనాథ్ మాగంటి. మొదటి భాగంలో కార్తీక్‌గా నటించిన సుశాంత్ రెడ్డికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. దీంతో రెండో భాగంలో శ్రీనాథ్ ఆ స్థాయిలో మెప్పించగలడా? లేదా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కొందరైతే అప్పుడే విమర్శలు కూడా చేశారు. అయితే సినిమా విడుదలయ్యాక తన నటనతో ఆ అనుమానాలన్నింటికీ సమాధానం చెప్పాడు శ్రీనాథ్.

పెద్ద సవాలుగా మారింది
సుశాంత్ రెడ్డి వ్యక్తిగత కారణాలతో పాటు కుటుంబ వ్యాపారాలపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నాడట. దీంతో కార్తీక్ పాత్ర కోసం శ్రీనాథ్ ని ఎంపిక చేశారు. అయితే మొదటి భాగంతో అనుబంధం పెంచుకున్న అభిమానులను సంతృప్తి పరచడం అతడికి పెద్ద సవాలుగా మారింది.  అయితే కార్తీక్ పాత్రలో సహజంగా ఒదిగిపోయి, ఆ స్నేహితుల బృందంలో ఒకడిగా ప్రేక్షకులకు కనిపించాడు. ముఖ్యంగా శివాత్మికతో అతడి ట్రాక్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అదే అతిపెద్ద గుర్తింపు
సినిమా విడుదలకు ముందు తన ఎంపికపై వచ్చిన విమర్శలకు శ్రీనాథ్ తన నటనతోనే సమాధానం ఇచ్చాడు. 'నా నటనతో దర్శక, నిర్మాతలు సంతృప్తి చెందకపోతే కార్తీక్ పాత్ర కోసం మరో నటుడిని తీసుకోవాలని భావించారు. కానీ ఈ రోజు సినిమా విడుదలైంది. అందులో నేను భాగమయ్యాను. అదే నాకు దక్కిన అతిపెద్ద గుర్తింపు' అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

ఇప్పటివరకు 'హిట్', 'యానిమల్' వంటి సినిమాల్లో సహాయ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీనాథ్ మాగంటికి 'ఈ నగరానికి ఏమైంది 2'లో కార్తీక్ పాత్ర మంచి గుర్తింపును తీసుకొచ్చింది.

(ఇదీ చదవండి: వీళ్లలో అదొక్కటే తేడా..!’ మామా అల్లుళ్లపై మీనాక్షి కామెంట్స్‌)

Videos

బిస్లరీ వాటర్ తాగుతున్నారా.. అయితే అంతే సంగతి.. FSSAI షాకింగ్ ప్రకటన..

షర్మిల గారు మిమ్మల్నే అడుగుతున్న.. వీటికి సమాధానం చెప్పండి చాలు..

పాక్ చేతిలో భారత్ కు ఘోర ఓటమి...

పెళ్ళికొడుకు తరుపు వాళ్ళు ఎంత బాధ పడుతున్నారంటే.. రాంనాథ్ షాకింగ్ నిజాలు

కేవలం 1 లక్షతో 10 లక్షలు సంపాదించే ప్లాన్.!

రణబీర్, యష్ కాదు..! పార్ట్ 2లో ఆయనే హైలెట్...

కండువా కప్పుకోలేదంతే..! బాబు చిటికెయ్యగానే.. పెళ్లి ఉన్నా సరే బెంగళూరు వెళ్లిపోయింది..

పేర్ని కిట్టు ఆధ్వర్యంలో YSRCP చేరిన TDP సీనియర్ నేత

చెల్లి అడిగిందని సొంత ఆస్తి ఇచ్చాడు.. తనది కాని ఆస్తి ఎలా ఇస్తాడు?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దిగి రానున్న బంగారం..!

Photos

+5

‘భోగి’ మూవీ ప్రీ రిలీజ్... రెడ్‌ శారీలో మెరిసిన హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫోటోలు)

+5

కార్తీక సోమవారం.. శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు (ఫోటోలు)

+5

విశాఖపట్నం : కార్తీక సండే.. సందడి (ఫోటోలు)

+5

అనిరుధ్- కావ్య రిసెప్షన్‌లో సినీ, క్రీడా ప్రముఖుల సందడి.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : కోటి దీపోత్సవంలో వైభవంగా మధుర మీనాక్షి కల్యాణం (ఫోటోలు)

+5

శర్వానంద్‌ ‘భోగి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

మిర్నా తాజా ఫొటోలు..

+5

ప్రభాస్‌ బ్యూటీ.. చీరలో మెరిసి (ఫోటోలు)

+5

డేంజర్ బాయ్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. (ఫోటోలు)

+5

హై మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫోటోలు)