నేను పక్కా తెలుగు యాక్టర్‌ని : శ్రీనాథ్‌ మాగంటి

Published on Wed, 03/04/2026 - 12:13

శ్రీనాథ్‌ మాగంటి హీరోగా బాల సతీష్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మెన్షన్‌ హౌస్‌ మల్లేష్‌’. ఇందులో గాయత్రీ రమణ, సాయి కామాక్షీ భాస్కర్ల హీరోయిన్లుగా నటించారు. రాజేష్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీనాథ్‌ మాగంటి మాట్లాడతూ– ‘‘ఈ సినిమా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్నప్పటికీ సబ్జెక్ట్‌ యూనివర్సల్‌. దారి తప్పిన మల్లేష్‌ (హీరో పాత్ర) అనే పొగరుబోతుని అతని తల్లి, భార్య కలిసి ఎలా దారిలోకి తీసుకొస్తారన్నదే ఈ సినిమా కథ.

 ఈ విషయాన్నే సరదాగా చెప్పా. ఫ్యామిలీ అంతా కలిసి నవ్వుకునే సినిమా ఇది. సతీష్‌గారు మంచి క్లారిటీ ఉన్న దర్శకుడు. నిర్మాత రాజేష్‌గారు ఈ సినిమాలో నటించడంతోపాటు కొన్ని డైలాగ్స్‌ రాశారు. ఈ చిత్రంలో నటించిన హరి హార్ట్‌ ఎటాక్‌ కారణంగా చనిపోయారు. అయితే తన పాత్ర చిత్రీకరణ అప్పటికే పూర్తయింది. ఈ సినిమా రూపంలో ఆయన ఎప్పటికీ జీవించే ఉంటారు. 

ఇక ఈ సినిమాతో యాక్టర్‌గా నన్ను నేను కొత్తగా స్క్రీన్‌పై చూపించుకోవడానికి ఒక చాన్స్‌  లభించింది. అందుకే మల్లేష్‌ క్యారెక్టర్‌ కోసం నన్ను నేను చాలా మార్చుకున్నాను.  ‘హిట్, యానిమల్, లక్కీభాస్కర్‌’ వంటి హిట్‌ చిత్రాల్లో నటించాను. కానీ కొందరు ప్రేక్షకులు నన్ను పరభాషా నటుణ్ణి అనుకుంటున్నారు. నేను పక్కా తెలుగు యాక్టర్‌ని. ఈ సినిమాతోనైనా తెలుగు ప్రేక్షకులు నా పేరు గుర్తు పెట్టుకుంటారని ఆశిస్తున్నాను.

 సందీప్‌ రెడ్డి వంగాగారు మా సినిమా ట్రైలర్‌ను లాంచ్‌ చేయడం హ్యాపీగా ఉంది. ప్రస్తుతం ఆయన ‘స్పిరిట్‌’ సినిమా షూట్‌తో బిజీగా ఉన్నారు. మా సినిమాను థియేటర్స్‌లో చూస్తానని చెప్పారు. ప్రస్తుతం ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్‌’ చిత్రంలో నటిస్తున్నాను. సోలో హీరోగా కొన్ని కథలు వింటున్నాను’’ అని తెలిపారు. 

Videos

విరోష్ వెడ్డింగ్ సూపర్ హిట్

శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌక పై దాడి

ఒక పశువులాగా.. క్లాస్ రూమ్ లోనే..! న్యూడ్ వీడియోలు తీసి..!

జయలలితే నాకు ఇన్స్పిరేషన్.. స్త్రీ గొప్పతనం చాటేలా “సరస్వతి" సినిమా

మషాద్ నగరంలో ఖమేనీ అంత్యక్రియలు

ఇరాన్ తో యుద్ధం.. బెడిసికొట్టిన అమెరికా ప్లాన్ పెంటగాన్ సంచలన రిపోర్ట్

BJP చేతికి బీహార్ సీఎం పోస్ట్ నితీష్ కుమార్ గుడ్ బై!

యుద్ధం దెబ్బ.. ఇన్వెస్టర్ల సంపద ఆవిరి

పీఎం రాహత్ స్కీమ్... ఆసుపత్రి బిల్లు ప్రభుత్వం కడుతుంది

ఇరాన్‌ తో యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం

Photos

+5

విరోష్ జంట రిసెప్షన్‌లో ప్రముఖుల సందడి (ఫోటోలు)

+5

#Virosh Reception: ఘనంగా విజయ్‌- రష్మిక రిసెప్షన్‌ (ఫోటోలు)

+5

'పీలింగ్స్‌..' పాటకు స్టెప్పులేసిన అనసూయ (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో ఘనంగా హోలీ సంబరాలు (ఫొటోలు)

+5

అభిమానులతో 'విరోష్' జోడీ బంతి భోజనాలు (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు (ఫొటోలు)

+5

ఆకుపచ్చ చీరలో మెరిసిపోతున్న హీరోయిన్ ప్రియమణి (ఫొటోలు)

+5

ఇది నా జర్నీ కాదు మనది.. మంచు మనోజ్-మౌనిక పెళ్లిరోజు స్పెషల్ (ఫొటోలు)

+5

‘సాంప్రదాయని సుప్పినీ శుద్ధపూసనీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)