Breaking News

శ్రీహరి మరణంతో మద్యానికి బానిసయ్యా: డిస్కో శాంతి

Published on Sun, 09/03/2023 - 14:10

డిస్కో శాంతి 1980లో వారికి పరిచయం అక్కర్లేని పేరు. ఐటం సాంగ్స్‌తో సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె అసలు పేరు శాంత కుమారిగా కాగా.. సినిమాల్లో నటనతో డిస్కో శాంతిగా ముద్రపడిపోయింది.  ఆగస్టు 28, 1965న జన్మించిన డిస్కో శాంతి పలు భాషలలో దాదాపు 900కి పైగా చిత్రాలలో కనిపించింది. ఆమె ఎక్కువగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఒడియా భాషల్లో నటించారు. మలయాళంలో ఉమై విజిలీ సినిమాలో ఆమె చేసిన డ్యాన్స్‌తో పాపులర్ అయింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. 

1986లో తొలిసారి ఉదయగీతం చిత్రంలో నటించారు. మొదట కొన్ని సినిమాల్లో సహాయ నటిగా నటించింది. అదే సమయంలో ఐటెం సాంగ్స్‌లో నర్తించే అవకాశం వచ్చింది. దాదాపు 11 ఏళ్ల పాటు సినీ పరిశ్రమలో ఉన్నారు. అతని తండ్రి సీఎల్ ఆనందన్ సినిమాల్లో కూడా నటించాడు. తమిళం, తెలుగు సినిమాల్లో ప్రముఖ పాత్రలు పోషించారు.

శ్రీహరితో ప్రేమ పెళ్లి

అయితే టాలీవుడ్ హీరో  శ్రీహరిని 1996లో ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లయిన తర్వాత కుటుంబాన్ని చూసుకోవడానికే ఆమె పరిమితయ్యారు. సినిమాలకు గుడ్‌ బై చెప్పారు. అయితే ఆమె భర్త అక్టోబరు 9, 2013న కాలేయ సంబంధ వ్యాధితో ముంబైలో కన్నుమూశారు. ఇటీవలే యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

శ్రీహరి మరణం తట్టుకోలేక..

డిస్కో శాంతి మాట్లాడుతూ.. 'బావ (శ్రీహరి) చనిపోయాక నేను మద్యానికి బానిసయ్యా. జరిగిన విషాదాన్ని మరచిపోవాలని చాలా ప్రయత్నించా. ఆయన చనిపోయిన మూడు నెలల తర్వాత  ధైర్యం తెచ్చుకున్నా. ఆ సమయంలో నా సోదరులు, కుటుంబ సభ్యులు మూడు నెలలకు పైగా నాతోనే ఉన్నారు. కానీ పిల్లల చదువుల కారణంగా వెళ్లిపోయారు. ఆ తర్వాత నా కుమారులు నాకు మద్దతుగా నిలిచారు.' అని శాంతి చెప్పింది.

శ్రీహరి, డిస్కో శాంతిలది ప్రేమ వివాహం కాగా.. కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలు పోషించిన శ్రీహరి, శాంతి డాన్స్ చూసి ప్రేమలో పడ్డారు. ఆమె కుటుంబం గురించి తెలుసుకుని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.  శ్రీహరి మరణించే వరకు టాలీవుడ్‌లో కలిసి మెలిసి ఉన్న జంటలలో ఒకరిగా నిలిచారు. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి