Breaking News

అదండీ ఆడదంటే.. నవ్వులు పూయిస్తున్న ‘ఏకే 47’ వీడియో

Published on Tue, 07/28/2026 - 12:05

వెంకటేశ్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం. 47’(AK 47). శ్రీనిధి శెట్టి, యువినా పార్థవి, రాజా ప్రజ్వల్‌, నారా రోహిత్‌, నివేతా పేతురాజ్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 2న విడుదల కానుంది. కాగా, ఈ చిత్రం ఇప్పటికే వెంకటేశ్‌ పాత్రను పరిచయం చేశారు. ఇందులో ఆయన చిట్టిబాబు అనే పాత్రలో ఆయన నటిస్తున్నారు. ఇక తాజాగా శ్రీనిధి శెట్టి పాత్రను పరిచయం చేశారు.

‘ఇల్లాలే దేవత అని చెబుతూ.. ‘ఈ ఆడవాళ్లకి ఆటిట్యూడ్‌ తప్ప గ్రాటిట్యూడ్‌ ఉండదు బుజ్జిగారు. ఆదండి ఆడదంటే.. కనపడగానే పువ్వులాగా ఎలా నవ్వుతుందో చూడండి(పక్కింటి అమ్మాయిని చూపిస్తూ..). నా పెళ్లం ఉంది ఎందుకు..ఎప్పుడో పెళ్లి ఫోటోలో స్మైల్‌ ప్లీజ్‌ అంటే అప్పుడు నవ్వింది. మళ్లీ ఇప్పటిదాకా నవ్వలేదు. ఎప్పుడు మొహం ఇలా పెట్టుకుంటుంది’ అంటూ వెంకీ చెప్పే డైలాగులు నవ్వులు పూయిస్తున్నాయి. ఇందులో శ్రీనిధి..స్వర్ణగా నటిస్తోంది.

‘చిట్టిబాబుకు భార్యగా, చిరునవ్వే చిరునామాగా ఉండే ఓ ఆప్యాయమైన మధ్యతరగతి ఇల్లాలిగా ఆమె పాత్ర ప్రేక్షకుల హృదయాలను హత్తుకోనుంది. చిట్టిబాబు–స్వర్ణల మధ్య ఉండే అనుబంధం, చిలిపి సంభాషణలు, అనురాగం, కుటుంబ విలువలు సినిమాకు మరింత ఆత్మను, ఆహ్లాదాన్ని అందించనున్నాయి’ అని మేకర్స్‌ తెలిపారు. 
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)