Breaking News

100 రోజులు ఆడిన శ్రీలీల మూవీ.. ఇప్పుడు తమిళంలో..

Published on Sun, 09/14/2025 - 16:01

వైరల్‌ వయ్యారి శ్రీలీల (Sreeleela) త్వరలో శివకార్తికేయన్‌కు జంటగా పరాశక్తి చిత్రంతో తమిళ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. దీనికంటే ముందు 'కిస్‌ మీ ఇడియట్‌' అనే చిత్రంతో తమిళ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఇది ఆమె కన్నడంలో నటించిన రెండవ చిత్రం కిస్‌కు రీమేక్‌ కావడం గమనార్హం. కన్నడలో కిస్‌ మూవీ 2019లో విడుదలై శతదినోత్సవం జరుపుకుంది. విరాట్‌ కథానాయకుడిగా నటించిన ఇందులో రోబో శంకర్‌, నాంజిల్‌ విజయమన్‌, అస్వతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు ఏపీ అర్జున్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జయశంకర్‌ రామలింగం ఛాయాగ్రహణం, ప్రకాష్‌ నిక్కి సంగీతాన్ని అందించారు. 

కథేంటంటే?
మాతృకకు పనిచేసిన డైరెక్టర్‌ అర్జున్‌ తమిళ వర్షన్‌కూ పని చేస్తున్నారు. కిస్‌ మీ ఇడియట్‌ చిత్రం సెప్టెంబర్‌ 26వ తేదీన తెరపైకి రానుంది. ఈ చిత్ర వివరాలను దర్శకుడు మీడియాకు వెల్లడించాడు. 'కాలేజీలో చదువుకునే శ్రీలీల తన తోటి విద్యార్థులతో కలిసి ఆట పట్టించినందుకు గాను ప్రిన్సిపల్‌ ఆమెను తరగతి గది నుంచి ఒక రోజు బహిష్కరిస్తాడె. దీంతో కోపంతో బయటికి వచ్చిన శ్రీలీల కళాశాల వెలుపల ప్రిన్సిపల్‌ ఫొటో ఉన్న బ్యానర్‌పై రాయి విసురుతుంది. ఆ రాయి అటుగా వస్తున్న విరాట్‌ కారుపై పడటంతో అద్దం పగులుతుంది. 

తప్పని స్థితిలో..
దీంతో శ్రీలీలను విరాట్‌ నష్టపరిహారంగా రూ.4 లక్షలు ఇవ్వమని డిమాండ్‌ చేస్తాడు. లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తాడు. అంత డబ్బు తన వద్ద లేదని శ్రీలీల ప్రాధేయ పడితే ఒక ముద్దు ఇవ్వు లేదా తన వద్ద రెండు నెలలు సహాయకురాలిగా పనిచేయమని చెబుతాడు. దీంతో శ్రీలీల అతని వద్ద రెండు నెలలు సహాయకురాలుగా పనిచేయడానికి అంగీకరిస్తుంది. అలా శ్రీలీల విరాట్‌పై ప్రేమ పెంచుకున్న తరుణంలో గడువు పూర్తి కావడంతో ఆమెను పని నుంచి తొలగిస్తాడు. ఆ తర్వాత ఆమె లేకుండా తాను ఉండలేనన్న భావన విరాట్‌కు కలుగుతుంది అలాంటి వారి ప్రేమ ఫలించిందా ? లేదా అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో కిస్‌ మీ ఇడియట్‌ రూపొందింది అని దర్శకుడు చెప్పారు.

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి