Breaking News

ఆ స్టార్‌ హీరోకు వీరాభిమానిని: శ్రీలీల

Published on Thu, 01/08/2026 - 07:43

అతి తక్కువ కాలంలోనే పాన్‌ ఇండియా రేంజ్‌కు ఎదిగింది హీరోయిన్‌ శ్రీలీల. ఈ బెంగళూరు బ్యూటీ 'పెళ్లి సందడి' చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత రవితేజ, మహేశ్‌బాబు వంటి పెద్ద హీరోలతో జత కట్టి క్రేజ్‌ తెచ్చుకుంది. ఆ మధ్య అల్లు అర్జున్‌ హీరోగా నటించిన పుష్ప – 2 చిత్రంలో కిస్సిక్‌ అనే ప్రత్యేక పాటలో నటించి పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. 

ఎన్నో ఆశలు
తాజాగా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి శివకార్తీకేయన్‌కు జంటగా పరాశక్తి చిత్రంలో నటించింది. ఈ చిత్రం పొంగల్‌ సందర్భంగా ఈనెల 10న తెరపైకి రానుంది. ఈమె తమిళంలో నేరుగా నటించిన చిత్రం పరాశక్తి కావడంతో శ్రీలీల ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఈ బ్యూటీ.. హీరో అజిత్‌కు వీరాభిమాని అని తెలిపింది. అంతే కాకుండా ఆయన అద్బుతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని పేర్కొంది. 

అజిత్‌ సినిమాలో..
ఈ అమ్మడు ఇటీవల మలేషియాలో కార్‌ రేస్‌లో పాల్గొన్న అజిత్‌ను కలిసి దిగిన ఫోటోను సామాజిక మాద్యమల్లో పోస్ట్‌ చేయగా అది నెటింట్లో వైరల్‌ అయ్యింది. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి కార్‌ రేస్‌లో పాల్గొంటున్న అజిత్‌ త్వరలో తన 64వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్రం ఫేమ్‌ అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించనున్న ఈ మూవీ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో అజిత్‌కు జంటగా శ్రీలీల నటించనున్నట్లు టాక్‌ నడుస్తోంది. అందుకే ఆమె అజిత్‌ గురించి గొప్పగా చెబుతున్నారనే ప్రచారం కూడా వైరల్‌ అవుతోంది.

Videos

రాయవరం ప్రజలు బాబుకు కౌంటర్ పేర్ని నాని ఫన్నీ రియాక్షన్

చిరు వెంకీ జస్ట్ టీజర్ మాత్రమే..! ముందుంది రచ్చ రంబోలా

హైకోర్టు తీర్పు ప్రభుత్వం, అధికారులకు చెంపపెట్టు: పేర్ని నాని

చాకిరీ మాకు.. పదవులు మీ వాళ్లకా? పవన్‌ను నిలదీసిన నేతలు

East Godavari: చంద్రబాబు బహిరంగ సభకు కనిపించని ప్రజా స్పందన

Business: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

తెలంగాణ డీజీపీకి హైకోర్టులో ఊరట..!

పోలీసుల తీరుపై మనోహర్ రెడ్డి ఫైర్

అర్ధ రూపాయి, రూపాయికి ఇస్తావా? లోకేష్ వ్యాఖ్యలకు పేర్ని నాని దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

ఏపీలో సంక్రాంతి రద్దీ.. బస్టాండ్లలో ప్రయాణికుల అవస్థలు

+5

రెడ్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ నిధి అగర్వాల్

+5

నగరంలో హీరోయిన్‌ డింపుల్‌ హయతీ సందడి (ఫొటోలు)

+5

విజయవాడలో ఘనంగా మహిళా ఫెస్ట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో రాజాసాబ్.. డార్లింగ్ ప్రభాస్ ఫోటోలు చూశారా?

+5

జూబ్లీహిల్స్‌లో ‍సందడి చేసిన సినీ నటి నివేదా పేతురాజ్ (ఫొటోలు)

+5

అర్థరాత్రి విమల్ థియేటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ (ఫొటోలు)

+5

'అనగనగా ఒక రాజు'లో మీనాక్షి చౌదరి.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

'అనగనగా ఒక రాజు' ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మానందం, మంగ్లీ (ఫోటోలు)