Breaking News

యాక్టర్‌ కమ్‌ డాక్టర్‌.. వైద్య పట్టా అందుకున్న శ్రీలీల

Published on Wed, 02/11/2026 - 15:06

ప్రముఖ తెలుగు నటి శ్రీలీల తన వైద్య విద్యను పూర్తి చేశారు. ఎంబీబీఎస్‌ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసుకుని తాజాగా డాక్టర్‌గా అర్హత సాధించారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఆమె తన చదువును ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. తల్లి గైనకాలజిస్ట్‌గా ఉండటం వల్ల చిన్నప్పటి నుంచే వైద్య రంగంపై ఆసక్తి కలిగిన శ్రీలీల, సినిమా షూటింగ్‌ల మధ్యలోనూ చదువుపై దృష్టి పెట్టి ఈ గొప్ప విజయాన్ని సాధించింది. 2023లో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్‌ను పూర్తి చేసుకొని..  తాజాగా కాన్వోకేష‌న్ వేడుక‌లో డిగ్రీ ప‌ట్టాను అందుకుంది.  దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.  అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

‘డాక్టర్‌’ శ్రీలీల వెనుక పెద్ద కథే ఉంది
శ్రీలీల వైద్య విద్యను అభ్యసించడానికి గల కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో షేర్‌ చేసుకుంది. అమ్మమ్మ విషయంలో జరిగిన ఓ సంఘటననే తనను మెడిసిన్‌ చదివేలా చేసిందని చెప్పారు. ‘నేను డాక్టర్‌ అవ్వాలని నిర్ణయం తీసుకోవడానికి వెనక ఓ స్టోరీ ఉంది. మా ఇంట్లో అమ్మతో పాటు అన్నయ్య కూడా డాక్టరే. ఓ సారి నేను అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లాను. అది మారుమూల గ్రామం. ఓ రోజు అమ్మమ్మ సడెన్‌గా కిందపడిపోయింది. ఏం చేయాలో తెలియదు. అందరితో పాటు నేను కూడా అక్కడే నిల్చోని చూస్తున్నా. కానీ అన్నయ్య వెంటనే వచ్చి అమ్మమ్మను పైకిఎత్తి వీపు భాగాన్ని పుష్‌ చేశాడు.

దీంతో అమ్మమ్మ ప్రమాదం నుంచి బయటపడింది. అన్నయ్య మెడిసిన్‌ చదవుతున్నాడు కాబట్టి.. ఆ సమయంలో ఏం చేయాలో అది చేశాడు. కానీ నాకు సహాయం చేయాలని అనిపించినప్పటికీ ఎలా చేయాలో తెలియదు. ఆ రోజే ఫిక్సయ్యా.. నేను ఎప్పటికైనా డాక్టర్‌ అవ్వాలని. అందుకే మెడిసిన్‌ కోర్సు తీసుకున్నాను’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)