Breaking News

రూ.150 కోట్ల బడ్జెట్‌ సినిమా.. ఛాన్స్‌ కొట్టేసిన శ్రీలీల

Published on Mon, 12/16/2024 - 07:44

వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు శివ కార్తికేయన్‌. ఈయన ఇటీవల రాజ్‌కుమార్‌ పెరియస్వామి దర్శకత్వంలో హీరోగా నటించిన అమరన్‌ చిత్రం ఘనవిజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. సాయి పల్లవి నాయికగా నటించిన ఈ చిత్రాన్ని నటుడు కమలహాసన్‌ తన రాజ్‌ కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై భారీ ఎత్తున నిర్మించారు. ప్రస్తుతం శివకార్తికేయన్‌ ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. 

తాజాగా మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు. ఇందులో నటి శ్రీలీల నాయకిగా నటించనున్నారు. ఇదే ఈమె నటిస్తున్న తొలి తమిళ చిత్రం. పుష్ప సినిమా తర్వాత ఆమెకు భారీగా ఛాన్స్‌లు పెరుగుతున్నాయి. అయితే, ఆమె సెలక్టెడ్‌ పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందకు వెళ్తుంది. ఇందులో ప్రముఖ నటుడు జయం రవి కూడా ప్రధాన పాత్రను పోషించనున్నారు. మరో ముఖ్య పాత్రలో నటుడు అధర్వ పోషించనున్నారు. 

డాన్‌ పిక్చర్స్‌ పతాకంపై ఆకాష్‌ భాస్కరన్‌ నిర్మిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ఇది. దీనికి జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది ఆయనకు 100వ చిత్రం కావడం విశేషం. అదేవిధంగా ఈ చిత్రానికి రవి కె.చంద్రన్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. దీని గురించి నిర్మాత అధికారిక ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. అందులో ఈ ఎస్‌.కె 25 చిత్రం ప్రేక్షకులకు కచ్చితంగా సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని నిర్మాత ఆకాష్‌ భాస్కరన్‌ వ్యక్తం చేశారు. 

ఇది పీరియడ్‌ కాల కథాంశంతో రూపొందుతున్న చిత్రం. దీనికి పురనానూరు అనే టైటిల్‌ ఇంతకుముందే ఖరారు చేశారు అన్నది గమనార్హం. ఈ చిత్రం రూ.150 కోట్ల బడ్జెట్లో రూపొందుతున్నట్లు సమాచారం. మల్టీ స్టార్స్‌ నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)