శ్రీలీల ఎవరి అమ్మాయో తెలిస్తే అంటూ షాకిచ్చిన అనిల్‌ రావిపూడి

Published on Mon, 10/16/2023 - 11:59

స్టార్‌ హీరోయిన్‌ శ్రీలీల  వరుసగా స్టార్‌ హీరోలతో నటించే అవకాశాలు దక్కించుకోవడమే కాకుండా తన టాలెంట్‌తో డ్యాన్స్‌,నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావు అనే మాటకు చెక్‌ పెడుతూ టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌గా నేడు నిలిచింది. ఓ వైపు  యంగ్‌ హీరోలతో ఆడిపాడుతూనే మరోవైపు 'భగవంత్‌ కేసరి'లో సీనియర్‌ హీరో బాలకృష్ణకు కుమార్తెగా నటించింది. ఇదొక్కటి చాలు ఆమె తీసుకునే నిర్ణయాలు ఎంత పర్‌ఫెక్ట్‌గా ఉంటాయో చెప్పడానికి. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన  'భగవంత్‌ కేసరి'లో బాలకృష్ణకు  ఏమాత్రం తగ్గకుండా తను నటించిదని ట్రైలర్‌లోనే అర్థం అవుతుంది. 

(ఇదీ చదవండి: ప్రేక్షకుల గుండెల్ని తాకిన నయని పావని.. ఈ కారణంతో నో రీ ఎంట్రీ)

తాజాగా శ్రీలీల, అనిల్‌ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో వారిద్దరి మధ్య ఉన్న బంధుత్వం ఎలాంటిదో రివీల్‌ చేశాడు. మొట్టమొదటిసారిగా, దర్శకుడు అనిల్ రావిపుడు తాను ఎప్పుడూ అందరితో పంచుకోని విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. స్టార్ హీరోయిన్ శ్రీలీల కుటుంబంతో ఆయనకు ఉన్న రిలేషన్‌షిప్‌ను మొదటిసారి బయటపెట్టాడు. శ్రీలీల అమ్మగారు డాక్టర్ స్వర్ణ సొంతూరు ఒంగోలు దగ్గరలో ఉన్న పొంగులూరు అని అదే ఊరు తన అమ్మమ్మగారిదని అనిల్‌ తెలిపాడు.


శ్రీలీల తల్లి స్వర్ణ తనకు సిస్టర్‌ వరుస అవుతుందని ఆయన పేర్కొన్నాడు. ఆ లెక్కన అనిల్‌కు శ్రీలీల కోడలు అవుతుంది. భగవంత్ కేసరి సెట్స్‌లో అందరి ముందూ అనిల్‌ణు డైరెక్టర్ గారు అని పిలిచే శ్రీలీల.. ఎవరూ లేనప్పుడు మాత్రం 'మామయ్య' అంటూ ఆట పట్టించేదట. శ్రీలీల పుట్టింది తెలుగు గడ్డపైనే అయినా ఆమె పెరిగింది, చదువుకున్నదంతా బెంగళూరు, అమెరికాలోనే కానీ తన అమ్మమ్మ ఊరు అయిన పొంగులూరుకు ప్రతి ఏటా వస్తూనే ఉంటుందని అనిల్‌ తెలిపాడు.

(అమ్మో ఏంటి ఈ అందం శ్రీలీల ఫొటోల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)