Breaking News

వరుస కష్టాలు.. నాకు ఎందుకింత క్షోభ?: శ్రీజ కొణిదెల

Published on Wed, 06/10/2026 - 12:06

మెగాస్టార్‌ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ కొణిదెల తన కష్టాలపై తొలిసారి పెదవి విప్పింది. చాలాకాలంపాటు తను అనుభవించిన బాధను బయటకు చెప్పుకుంది. ఎట్టకేలకు ఆ బాధ నుంచి బయటకు వచ్చేశానంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో షేర్‌ చేసింది. "నాకే ఎందుకిలా జరుగుతోంది? ఎందుకింత బాధ అనుభవిస్తున్నాను? ఒకదాని వెంట మరొకటి వరుసగా కష్టాలు చుట్టుముడుతున్నాయేంటి? నేనేం పాపం చేశానని ఇంత క్షోభ అనుభవిస్తున్నాను? అని చాలారోజులు నాలో నేనే మథనపడ్డాను. 

ఆలోచనల్లో క్లారిటీ
నేను బాధితురాలిని అని బాధపడుతూ కూర్చున్న నేను నెమ్మదిగా ఆ భావన నుంచి బయటకు వచ్చాను. మన జీవితమేంటి.. ఇలా ఉంది! అని బాధపడటానికి బదులుగా దాన్ని మార్చుకునేందుకు ఏం చేయగలం? అని తెలుసుకోవడమే అసలైన మార్పు అని తెలుసుకున్నాను. 'సెల్ఫ్‌ మాస్టరీ ప్రాజెక్ట్‌' వల్ల నాలో ఆ మార్పు మొదలైంది. నా ఆలోచనల్లో క్లారిటీ వచ్చింది. జీవితం ప్రశాంతంగా మారింది. నేనేంటో తెలుసుకున్నాను.

తప్పు తెలుసుకున్నా..
ఒకప్పుడు నా లైఫ్‌లో జరిగిన తప్పులే నా గుర్తింపును నిర్ధారించాయనుకున్నాను. కానీ, అది తప్పని తెలుసుకున్నాను. బాధ నాలో ఒక భాగమే కానీ, అదే జీవితం కాదని తెలిసొచ్చింది. మనిషిలో ఇంకా ఎన్నో లేయర్స్‌ ఉంటాయి. వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉంటుంటే చాలా బాగుంది" అని చెప్పుకొచ్చింది. ఒకప్పుడు గుండె లోతుల్లో బాధను అనుభవించిన తాను ఇప్పుడు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నానంది. ఈ పోస్ట్‌కు నిహారిక కొణిదెల స్పందిస్తూ.. "మై సూపర్‌ ఉమెన్‌" అని కామెంట్‌ పెట్టింది.

పెళ్లి
శ్రీజ కొణిదెల 2007వ సంవత్సరంలో శిరీష్‌ భరద్వాజ్‌ను పెళ్లి చేసుకుంది. ఏడాది తిరిగేలోపు వీరికి కూతురు నివృతి జన్మించింది. కానీ కొంతకాలానికే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. 2011లో భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టి పుట్టింటికి తిరిగొచ్చేసింది. 2014లో వీరికి విడాకులు మంజూరయ్యాయి. 2016లో నటుడు కల్యాణ్‌ దేవ్‌ను రెండో పెళ్లి చేసుకుంది శ్రీజ. వీరికి 2018లో కూతురు నవిష్క జన్మించింది. కానీ ఈ దాంపత్య జీవితం కూడా ఎంతోకాలం సాగలేదు. 2022లో వీరు విడిపోయారు.

 

 

చదవండి: R సెంటిమెంట్‌.. భారతీరాజా గురించి ఈ విషయాలు తెలుసా?

Videos

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులు.. వీడియో వైరల్..!

LIVE: YSRకు జగన్ నివాళులు

దిగొచ్చిన గోల్డ్ భారీగా తగ్గిన బంగారం.. వెండి

ఇరుముడి OTTలోకి ఎప్పుడు.?

లోకల్ ఎన్నికల్లో భారీ విజయం జగన్ దిశానిర్దేశం

Kapra Lake: గణేష్ విగ్రహాల నిమజ్జనంపై వివాదం..

తెనాలిలో వ్యాపారి కిడ్నాప్ కేసు విషాదాంతం

చంద్రబాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు హెచ్చరిక

సభలో అందరిముందు జనసేన గాలి తీసిన బాబు..

Idupulapaya: YSR ఘాట్‌ వద్ద జగన్‌ నివాళులు

Photos

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)