Breaking News

పక్కా దసరా పండగ సినిమా ఇది: హీరో శ్రీ విష్ణు

Published on Sat, 10/10/2026 - 02:49

శ్రీవిష్ణు, మహిమా నంబియార్‌ హీరో హీరోయిన్లుగా జానకిరామ్‌ మారెళ్ల దర్శకత్వంలో రూ పొందిన సినిమా ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’. కోన వెంకట్‌ సమర్పణలో వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించిన ఈ సినిమా నిన్న (శుక్రవారం) విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం యూనిట్‌ నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు నేను కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ జానర్‌లో చాలా సినిమాలు చేశాను.

దీంతో మాస్‌ కామెడీ సినిమా అయిన ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ను ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అనుకునేవాడిని. కానీ ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది’’ అని అన్నారు.‘‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ను హిలేరియస్‌ ఎంటర్టైన్మెంట్‌గా ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు’’ అని కోన వెంకట్‌  తెలిపారు. ‘‘సినిమా చాలా బాగుందని మంచి టాక్‌ వస్తోంది. ఈ దసరాకు శ్రీ విష్ణు, కోనగార్ల నుంచి ప్రేక్షకులకు అందిన ఒక పెద్ద గిఫ్ట్‌ ఈ సినిమా’’ అని తెలిపారు వెంకట కృష్ణ కర్నాటి. ‘‘ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన నాకు ఎంతో ఆనందాన్నిస్తోంది. ఈ సినిమాను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు జానకిరామ్‌.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)