Breaking News

ఓటీటీలోనే సూపర్ హిట్ వెబ్ సిరీస్.. రెండో సీజన్ రిలీజ్ ఫిక్స్

Published on Thu, 08/01/2024 - 08:33

ఓటీటీల్లో కొన్ని సినిమాలు, వెబ్ సిరీసులు సూపర్ హిట్ అవుతుంటాయి. అలాంటి లిస్టులో కచ్చితంగా ఉండే సిరీస్ 'స్క్విడ్ గేమ్'. 2021లో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ సిరీస్.. ఊహించిన దానికంటే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా తీసిన రెండో సీజన్‌కి సంబంధించిన స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేశారు. అలానే మూడో సీజన్ గురించి కూడా అప్‌డేట్ ఇచ్చేశారు.

(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట విషాదం)

ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ వెబ్ సిరీసుల్లో 'స్క్విడ్ గేమ్' ఒకటి. తొమ్మిది ఎపిసోడ్స్‌తో తీశారు. క్షణక్షణం టెన్షన్ అనిపించే థ్రిల్లింగ్ అంశాలతో దీన్ని తెరకెక్కించారు. అప్పట్లో వరల్డ్ మోస్ట్ పాపులర్ సిరీస్‍గా నిలిచింది. చిన్నచిన్న గేమ్‍లతోనే ఉండే ఈ స్క్విడ్ గేమ్‍లలో ప్రాణాలను కాపాడుకునేందుకు కంటెస్టెంట్లు చేసే పోరాటాన్ని చూపించారు.

హ్వాంగ్ డాంగ్ హ్యుక్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ రెండో సీజన్‌ని ఈ ఏడాది డిసెంబరు 26 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. తొలి సీజన్‌లానే ఇప్పుడు తెలుగు డబ్బింగ్ కూడా ఉండనుంది. అలానే వచ్చే ఏడాది మూడో సీజన్  కూడా తీసుకొస్తామని, దీంతో సిరీస్‌కి ముగింపు ఇస్తామని ప్రకటించారు.

(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు రిలీజ్)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)