Breaking News

'స్పై' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. వచ్చేది ఆ ఓటీటీలోనే

Published on Thu, 06/29/2023 - 12:44

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ నిఖిల్ కొత‍్త సినిమా 'స్పై'. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తీసిన ఈ మూవీపై రిలీజ్ కు ముందే మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి. అలా ఈ చిత్రం తాజాగా థియేటర్లలోకి వచ‍్చింది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంటోంది. ఇదే సమయంలో 'స్పై' ఓటీటీ పార్ట్‌నర్ ఎవరనేది కూడా తెలిసిపోయింది. దీంతో ఓటీటీ ఆడియెన్స్ అలెర్ట్ అయిపోయారు. మరి ఏ ఓటీటీలో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.

'స్పై' కథేంటి?
ఈ సినిమాలో నిఖిల్ పాత్ర పేరు జై. 'రా' ఇంటెలిజెన్స్‌లో ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. శ్రీలంకలో ఓ మిషన్ పూర్తి చేసి, స్వదేశానికి తిరిగొస్తాడు. రా చీఫ్ శాస్త్రి, ఇతడికి ఐదేళ్ల క్రితం జోర్డాన్ లో చనిపోయిన ఏజెంట్ సుభాష్ ఫైల్ అప్పగిస్తాడు. అతడి చావు వెనక కారణం తెలుసుకోమంటాడు. అలా ఈ మిషన్ లో భాగమైన ఏజెంట్ జైకి బోలెడన్ని కొత్త విషయాలు తెలుస‍్తాయి. చివరకు ఏమైంది? అసలు ఈ స్టోరీకి సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీకి సంబంధమేంటి? తెలియాలంటే థియేటర్లలో ఈ మూవీని చూడాల్సిందే. 

ఆ ఓటీటీలోనే
తెలుగు ప్రేక్షకులకు దాదాపుగా తెలిసిన కథతోనే 'స్పై' తీశారు. చూస్తున్నంతసేపు అలా సాగుతూనే వెళ్తుంది తప్ప పెద్దగా గొప్పగా ఏం అనిపించదు. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకుంది. మూవీ ప్రారంభంలో ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. బహుశా 5-6 వారాల తర్వాతే స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆగస్టు తొలి లేదా రెండోవారంలో 'స్పై' సినిమా ఓటీటీలోకి రావొచ్చని అంచనా. పూర్తి క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

(ఇదీ చదవండి: 'స్పై' సినిమా రివ్యూ)

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)