Breaking News

'స్పిరిట్' సినిమా.. డైరెక్టర్ సందీప్ షాకింగ్ డెసిషన్!

Published on Sat, 11/29/2025 - 21:02

రీసెంట్‌గానే ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబోలో సినిమా మొదలైంది. దీనికి 'స్పిరిట్' అనే టైటిల్ ఎప్పుడో ఫిక్స్ చేశారు. ఇకపోతే లాంచ్ అయిన రోజు నుంచే షూటింగ్ మొదలుపెట్టారు. హైదరాబాద్‌లోని కోఠి మహిళల కాలేజీ దగ్గర చిత్రీకరణ జరిగిందని తెలుస్తోంది. త్వరలో షూటింగ్ కోసమే విదేశాలకు కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ విషయంలో ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.

'స్పిరిట్' షూటింగ్ మొదలుపెట్టాలని చాన్నాళ్లుగా సందీప్ ఎదురుచూస్తూ వచ్చాడు. ఇతర సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉండటం వల్ల అది ఆలస్యమైంది. తాజాగా ప్రభాస్ ఫ్రీ కావడంతో చిత్రీకరణ మొదలైంది. చిన్నపాటి షెడ్యూల్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఒక్కసారి ప్రాజెక్ట్ మొదలుపెడితే సదరు ప్రాజెక్టుని సందీప్ వీలైనంత త్వరగా పూర్తి చేస్తుంటాడు. 'స్పిరిట్' విషయంలోనూ అదే ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాబోయే ఆరు నెలలు పాటు బయట కనిపించొద్దని ప్రభాస్‌కి చెప్పాడట. దీనికి హీరో కూడా ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హారర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

'స్పిరిట్' కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాన్నాళ్ల క్రితమే జరిగింది. పాటలు, నేపథ్య సంగీతం లాంటివి ముందే కంపోజ్ చేసి పెట్టుకున్నారు. కాబట్టి షూటింగ్ త్వరగా పూర్తయితే చాలావరకు పని పూర్తయినట్లు అవుతుంది. అప్పటివరకు ప్రభాస్ లుక్స్ లీక్ అవకుండా ఉండేందుకు.. ప్రభాస్‌కి కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది.

ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా తృప్తి దిమ్రి నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. వీళ్లతో పాటు బాలీవుడ్ నటి కాజోల్ కూడా మరో ముఖ్య పాత్రలో కనిపించనుందనే రూమర్ ఒకటి వినిపిస్తుంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం ఈమెకు ఇది తొలి తెలుగు చిత్రమవుతుంది. ఇకపోతే ఈ మూవీ 2027లోనే వచ్చే అవకాశాలు ఎక్కువ!

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9.. ఈసారి ఆమెతో పాటు మరొకరు ఎలిమినేషన్!?)

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)