ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే... కాకుమానుపై పోలీసుల తీరు.. అడ్వకేట్ రజినీ షాకింగ్ నిజాలు
Breaking News
స్పైడర్ మ్యాన్ ఊచకోత.. ఇక్కడే రూ.1000 కోట్లు వస్తాయేమో?
Published on Mon, 08/03/2026 - 16:10
స్పైడర్ మ్యాన్ సినిమాలకు మన దేశంలోనూ చాలా క్రేజ్ ఉంది. ఎప్పటినుంచి ఈ ఫ్రాంచైజీలో మూవీస్ వస్తున్నాయి. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా లేటెస్ట్ చిత్రం 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'. టామ్ హోలండ్, జెండయా ప్రధాన పాత్రలు చేశారు. గత గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. తొలి వీకెండ్ ముగిసేసరికి సరికొత్త రికార్డులు సృష్టించింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)
ప్రపంచవ్యాప్తంగా 927 మిలియన్ డాలర్లు(సుమారు రూ.8830 కోట్లు) వసూళ్లు రాగా.. భారతదేశం నుంచి రూ.309 కోట్ల కలెక్షన్ వచ్చింది. ఈ విషయాన్ని అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి మరీ ప్రకటించారు. స్పైడర్ మ్యాన్ ఊపు చూస్తుంటే మన దగ్గరే రూ.1000 కోట్ల వసూళ్ల మార్క్ దాటేస్తాడేమో అనిపిస్తుంది. థియేటర్లలో అలాంటి సందడి కనిపిస్తుంది
దాదాపు 225 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,100కోట్లు) బడ్జెట్‌తో ఈ సినిమా తీయగా.. తొలి వీకెండ్ అయ్యేసరికి పెట్టుబడిని రాబట్టేసి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో 38వ మూవీ కాగా.. డిసెంబరులో తర్వాత చిత్రమైన 'అవెంజర్స్ డూమ్స్ డే' రాబోతుంది. మరి ఇదెలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: నేను చేసిన పనికి కేసు పెట్టాలనుకున్నారు: సీఎం విజయ్ కొడుకు)
You showed up, you cheered, and together we made history. This celebration is yours ❤️🕷️#SpiderManBrandNewDay in cinemas now, in English, Hindi, Tamil, Telugu, Malayalam & Kannada. Book your tickets via the link in bio. pic.twitter.com/Ivw4twanBK
— Sony Pictures India (@SonyPicsIndia) August 3, 2026
Tags : 1