రజినీకాంత్ బర్త్ డే.. ప్రముఖ నిర్మాణ సంస్థ స్పెషల్ వీడియో!

Published on Fri, 12/12/2025 - 09:03

తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ ఇవాళ 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ఏడాది కూలీ మూవీతో అభిమానులను మెప్పించారు. ప్రస్తుతం రజినీ జైలర్-2 మూవీలో నటిస్తున్నారు. ఇవాళ ఆయన పుట్టినరోజు కావడంతో బ్లాక్‍ బస్టర్‌ మూవీ నరసింహాను రీ రిలీజ్ చేస్తున్నారు. తలైవాకు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌ ప్రముఖులు బర్త్‌ డే విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

తాజాగా రజినీకి ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ బర్త్ డే విషెస్ చెబుతూ వీడియోను రిలీజ్ చేసింది. రజనీ సినిమాల్లోని డైలాగులతో మ్యాష్‌అప్‌ వీడియోను రూపొందించి పుట్టినరోజు శుభాకంక్షలు తెలిపింది. ఒక రేంజ్‌ తర్వాత మాటలు ఉండవు.. అర్థమైందా రాజా.. డైలాగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకునేలా ఉ‍న్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.

సూపర్‌హిట్‌ సినిమాకు సీక్వెల్‌..

రజినీకాంత్, సౌందర్య, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన నరసింహ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. 1999లో విడుదలైన ఈ సినిమా తలైవా కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ నీలాంబరి పాత్రలో అదరగొట్టేసింది. ఈ మూవీ రిలీజై ఇప్పటికి 26 ఏళ్లు అవుతున్నా సోషల్‌ మీడియా రీల్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మరోసారి రమ్యకృష్ణ, రజినీకాంత్ అభిమానులను అలరించనుంది. వీరిద్దరు ప్రస్తుతం జైలర్‌ 2లో నటిస్తున్నారు.

కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో వచ్చిన నరసింహకు సీక్వెల్ తప్పకుండా ఉంటుందని రజినీకాంత్ ఇటీవలే ప్రకటించారు. ఈ మూవీకి నీలాంబరి అనే టైటిల్‌ అని ఖరారు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ మూవీ కథపై చర్చలు జరుగుతున్నట్లు నరసింహ రీ రిలీజ్‌ ప్రచారంలో భాగంగా రజినీకాంత్ తెలిపారు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)