కేరళ కోసం విరాళాలు ప్రకటించిన స్టార్స్‌.. ఎవరెవరు ఎంత..?

Published on Thu, 08/01/2024 - 20:59

కేరళలో భారీ వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఎక్కడ చూసిన నీటితో నిండిపోయిన నగరాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వయనాడ్‌ ప్రాంతంలో భారీ వర్షం వల్ల చాలామంది ఆశ్రయం కూడా కోల్పోయారు. యాన్ని  ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడంతో ఇప్పటికే 200 మందికి పైగానే విగతజీవులుగా  మారితే.. మరికొంత మంది ఆచూకీ లేకుండా పోయింది.  ఇప్పటికీ అనేకమంది శిథిలాల్లో చిక్కుకుపోయారు. ఈ విపత్తులో కేరళను ఆదుకునేందుకు తమ వంతుగా సాయం చేసేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు.

సౌత్‌ ఇండియా స్టార్‌ హీరో మమ్ముట్టి, ఆయన కుమారుడు  దుల్కర్ సల్మాన్ సాయం చేసేందకు ముందుకొచ్చారు.  రెస్క్యూ ఆపరేషన్ కోసం ఆర్థిక సహాయం కోసం మమ్ముట్టి రూ.20 లక్షలు, దుల్కర్ సల్మాన్‌ రూ. 15 లక్షలు కేరళ  మంత్రి పి రాజీవ్‌కు అందజేశారు. ఇదే సమయంలో ఫహాద్ ఫాజిల్- నజ్రియా దంపతులు కూడా  ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షలు విరాళం అందించారు. ఈ విషయాన్ని స్వయంగా ఫహద్ ఫాజిల్ తన నిర్మాణ సంస్థ ఫహద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్ లెటర్‌ ప్యాడ్‌పై ముఖ్యమంత్రికి రాసిన లేఖను షేర్ చేస్తూ తెలియజేశాడు. 

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా రూ. 10 లక్షలు ప్రకటించారు. అయితే, ఇప్పటికే సూర్య, జ్యోతిక, కార్తీ రూ. 50 లక్షలు అందించగా.. విక్రమ్ రూ. 20 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. కేరళ కోసం అండగా నిలబడుతున్న స్టార్‌ హీరోలను నెటిజన్లు అభినందిస్తున్నారు.
 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)