Breaking News

హిట్ కొట్టారు సరే.. కానీ ఆ స్టార్స్‌ను మరిపిస్తారా?

Published on Wed, 12/13/2023 - 13:01

గత కొన్నేళ్లుగా దక్షిణాది చిత్రాలు విజయాల సంఖ్య బాగానే పెరిగిందనే చెప్పాలి. కొన్ని భారీ చిత్రాలతో పాటు చిన్న చిత్రాలు మంచి వసూళ్లు రాబట్టి చిత్ర పరిశ్రమ మనుగడకు అండగా నిలిచాయి. ముఖ్యంగా దక్షిణాది సినీతారలు బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ విశేషం. కోలీవుడ్‌ యువ దర్శకుడు అట్లీ తొలిసారిగా దర్శకత్వం వహించిన హిందీ చిత్రం జవాన్‌ సంచలన విజయాన్ని సాధించింది.

ఈ చిత్రం ద్వారా దక్షిణాది లేడీస్‌ సూపర్‌స్టార్‌ నయనతార బాలీవుడ్‌లోకి అడుగు పెట్టారు. దర్శకుడు అట్లీ, నటి నయనతార, నటుడు విజయ్‌ సేతుపతికి అక్కడ జవాన్‌ చిత్రం మైల్‌స్టోన్‌గా మిగిలింది. అంతకు ముందు వరకు దక్షిణాదిలో టాప్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార ఇప్పుడు పాన్‌ ఇండియా కథానాయకిగా తన స్థాయిని విస్తరించుకున్నారు. 

మరోవైపు డిసెంబర్‌ 1 విడుదలైన యానిమల్‌ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించగా.. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా జంటగా నటించారు. అయితే సందీప్‌కు హిందీలో ఇదే తొలి చిత్రం కాగా.. నటి రష్మికకు మూడవ చిత్రం కావడం గమనార్హం. ఈమె ఇంతకు ముందే నటించిన గుడ్‌ బై, మిషన్‌ మజ్ను చిత్రాలు ఆశించిన విజయాలు సాధించలేదు. 

అయినా నటి రష్మిక మందన్నకు నటిగా మంచి మార్కులే పడ్డాయి. అయితే ఇక్కడ విజయమే కొలమానం కాబట్టి యానిమల్‌ చిత్ర విజయం ఈమెకు చాలా కీలకంగా మారింది. కాగా ఈ చిత్ర విషయం రష్మికలో నూతనోత్సాహం వచ్చిందనే చెప్పాలి. గతంలో వహిదా రెహమాన్‌, హేమమాలిని, శ్రీదేవి వంటి నటీమణులు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా రాణించారు. 

ఇటీవల నటి దీపికా పదుకొణె లాంటి బాలీవుడ్ తారలు టాప్‌ హీరోయిన్లుగా రాణిస్తున్నా ఆ స్థాయిలో పేరు రాలేదు. కాగా ఈ ఏడాది విడుదలైన దక్షిణాది హీరోయిన్లు నటించిన రెండు హిందీ చిత్రాలు సంచలన విజయాలను సాధించడంతో రష్మిక, నయనతారలు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారారు. అలాగని ఈ ఇద్దరికి హిందీలో కొత్తగా అవకాశాలేమీ రాలేదు. రష్మిక తెలుగులో, నయనతార తమిళంలో వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు.

Videos

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)