Breaking News

ప్రముఖ సినీ నటి కుమార్తెలు.. ఇద్దరూ డాక్టర్లే

Published on Fri, 12/27/2024 - 06:54

ఇతర రంగాల కంటే సినిమా రంగంలోనే వారసుల రంగప్రవేశం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ క్రమంలో చిత్రపరిశ్రమకు చెందిన వారి వారసులు ఇప్పటికే హీరోలు, హీరోయిన్‌లు, దర్శకులు, నిర్మాతలుగానూ రాణిస్తున్నారు. అయితే ఒక సినీ జంట మాత్రం తమ వారసులను సినిమాకు దూరంగా, వైద్యులను చేయడం విశేషమే అవుతుంది. ఆ జంట ఎవరో కాదు తమిళ నటుడు, దర్శకుడు పొన్వన్నన్‌, శరణ్య దంపతులే.. వారి గురించి చెప్పాలంటే మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్‌ కథానాయకుడిగా నటించిన నాయకన్‌ చిత్రం ద్వారా కథానాయకిగా శరణ్య రంగప్రవేశం చేశారు. అందులో అమాయకమైన యువతి పాత్రలో చక్కని నటనను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. 

ఆ తరువాత పలు చిత్రాల్లో కథానాయకిగా నటించే అవకాశాలు ఈమెను వరించాయి. ఆ తరువాత అక్కగా, అమ్మగా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో నటిస్తూ పేరు తెచ్చుకున్నారు. రఘువరన్ బీటెక్ చిత్రంలో ధనుష్‌కు అమ్మగా శరణ్య నటించారు.  ఆ చిత్రంతో తెలుగు వారికి మరింత చేరువ అయ్యారు. ఇక పొన్వన్నన్‌ కూడా పలు చిత్రాల్లో నటిస్తుండడంతోపాటు కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. ఇలా చిత్ర పరిశ్రమలో హోదా, అంతస్తు గడించిన ఈ సినిమా జంట తమ వారసులను మాత్రం ఈ రంగానికి దూరంగా పెంచడం విశేషం. 

వీరికి చాందిని, ప్రియదర్శిని అనే ఇద్దరు కూతుళ్లు. చూడడానికి ఇద్దరూ హీరోయిన్స్‌లా ఉంటారు. అయితే పొన్వన్నన్‌, శరణ్య దంపతులు తమ ఇద్దరి వారసురాళ్లనూ వైద్యవిద్యను అభ్యసించేలా చేశారు. వారిద్దరూ డాక్టర్లుగా పట్టభద్రులు అయ్యారు. గతేడాదిలో పెద్ద కూతురు చాందిని ఎంబీబీఎస్‌ పూర్తి చేయగా ఇప్పుడు రెండో కూతురు ప్రియదర్శిని శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పట్టభద్రురాలైంది. దీనికి సంబంధించిన ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)