Breaking News

ఓటీటీలో సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన 'సోనూ సూద్‌' సినిమా

Published on Fri, 03/07/2025 - 08:30

నెగటివ్‌ క్యారెక్టర్స్‌లో తనదైన విలనిజాన్ని పండించిన సోనూ సూద్‌ హీరోగా నటించిన బాలీవుడ్‌ చిత్రం 'ఫ‌తే' స‌డెన్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రానికి సోనూయే దర్శకత్వం వహించడంతో పాటు  నిర్మాతగా కూడా వ్యవహరించారు.‘ఫతే’ మూవీకి రచయిత కూడా సోనూనే కావడం విశేషం. పూర్తి స్థాయి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌హీరోయిన్‌గా న‌టించింది. న‌సీరుద్దీన్ షా, విజ‌య్ రాజ్‌, నాగినీడు కీల‌క పాత్ర‌లు పోషించారు. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 10న థియేటర్స్‌లో ఈ మూవీ సందడి చేసింది.

సైబర్‌ క్రైమ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఫతే చిత్రం సడెన్‌గా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ప్రస్తుతం కేవలం హిందీ వర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, మరో వారంలోపు తెలుగు వర్షన్‌లో కూడా ఈ చిత్రం రానుందని తెలుస్తోంది. ఈ మూవీతోనే డైరెక్ట‌ర్‌గా అరంగేట్రం చేసిన సోనూ ప్రేక్షకులను మెప్పించాడు.  సైబర్‌ క్రైమ్‌లో ఎదురయ్యే సవాళ్ల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్‌తో ఫతే చిత్రాన్ని సోనూసూద్ భార్య సోనాలి సూద్ నిర్మించింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 30 కోట్ల లోపే కలెక్షన్స్‌ రాబట్టింది.

కథేంటి..?
సైబర్‌ నేరాలు ఎలా జరుగుతాయో ఈ చిత్రంలో చూపించారు. పంజాబ్‌లోని ఒక గ్రామంలో పాల వ్యాపారం చేస్తున్న ఫతేహ్‌ సింగ్‌ (సోనూసూద్‌) వద్ద పని చేసే వ్యక్తి లోన్‌ యాప్‌ నిర్వాహుకల వేధింపుల వల్ల  ఆత్మహత్య చేసుకుంటాడు.  ఈ సంఘటన ఫతేహ్‌లో తీవ్రమైన ఆవేదన ఏర్పడుతుంది. అతని ఆత్మహత్యకు కారణం లోన్‌ యాప్‌ అని తెలుసుకుని లోతుగా పరిశీలిస్తాడు. ఈ క్రమంలో ఇదే లోన్‌ యాప్‌ వల్ల చాలమంది మరణించారని తెలుసుకుంటాడు.  సరిగ్గా అదే సమయంలో  తన ఇంట్లో నివసించే నిమ్రత్‌ కౌర్‌ (శివజ్యోతి రాజ్‌పుత్‌)ను ఓ సైబర్‌ క్రైమ్‌ ముఠా కిడ్నాప్‌ చేస్తుంది. 

ఆమెను కాపాడే క్రమంలో ఫతేహ్‌కు అనేక సమస్యలు ఎదురౌతాయి. ఆమెను వారు ఎందుకు కిడ్నాప్ చేశారు..?  ఆ లోన్‌ యాప్‌ సంస్థతో నిమ్రత్‌ను కిడ్నాప్‌ చేసిన  ముఠాకు ఉన్న లింక్‌ ఏంటి..? పాల వ్యాపారం చేసే  ఫతేహ్‌ గతమేంటి..?  హ్యాకర్‌ ఖుషీతో (జాక్వెలైన్‌) ఫతేహ్‌కు ఉన్న సంబంధం ఏంటి..? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ చిత్రంలో  మితిమీరిన హింస ఉంటుంది.  సోనూసూద్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్‌కు ఫిదా అవుతారు. ముఖ్యంగా సెకండాఫ్‌ బాగా నచ్చుతుంది.

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)