Breaking News

మొదటి ఆడిషన్.. ఆంటీ మాటలతో ఇబ్బందిగా ఫీలయ్యా: హీరోయిన్

Published on Wed, 02/19/2025 - 18:13

బాలీవుడ్ నటి సోనాలి కులకర్ణి ప్రస్తుతం సరికొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సిరీస్‌లో శ్వేతా బసు ప్రసాద్, జావేద్ జాఫేరి ఐమీ ఐలా కీలక పాత్రల్లో నటించారు. ఈ కామెడీ సిరీస్‌గా 'ఊప్స్ అబ్‌ క్యా'ను తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 20 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సోనాల్ కులకర్ణి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన సంఘటనలను వివరించింది. మొదటిసారి సినిమా ఆడిషన్‌కు వెళ్లినప్పుడు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించింది. ఆ సమయంలో చాలా ఇబ్బందిగా అనిపించిందని పేర్కొన్నారు.

సోనాలి కులకర్ణి మాట్లాడుతూ.. ' ఓ సినిమా ఆడిషన్ కోసం తన వద్ద ఉన్న ఏకైక పంజాబీ సూట్‌ను ధరించా. నాతో పాటు ఆడిషన్‌కు మరో 25 మంది అమ్మాయిలు హాజరయ్యారు.  అయితే అప్పుడు డైరెక్టర్ గిరీష్ కర్నాడ్‌ను కలుస్తున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది. నేను లోపలికి వెళ్లగానే అక్కడ నా స్నేహితులు ఉన్నారు. వారిలో ఒకరిద్దరు నాకంటే పెద్దవాళ్లు కూడా ఉన్నారు.  సిటీలో పేరున్న ఒకామె 'ఎందుకు వచ్చావ్' అని అడిగింది. ఆమె ప్రశ్నలోని వ్యంగ్యం నాకు అర్థం కాలేదు. అందిరిలాగే వర్క్‌షాప్‌కు వచ్చానని సమాధానం ఇచ్చా. కానీ ఆమె (ఆంటీ) నన్ను చూస్తూ కెమెరాలో ముదురుగా ఉండే అమ్మాయిలు చాలా బాగా కనిపించరని మీకు తెలియదా? అ‍న్నారు. ఆ సమయంలో నాకు 16 ఏళ్ల వయసు. ఆమె మాటలతో చాలా ఇబ్బంది పడ్డా. చాలా డిస్టర్బ్ అయ్యా. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానా అనిపించింది.' అని వెల్లడించారు.

ఆ తర్వాత జరిగిన ఆడిషన్‌లో డైరెక్టర్ గిరీశ్ కర్నాడ్‌ అందరినీ పలకరించాడు. ఆయన వచ్చాక నన్ను నేను పరిచయం చేసుకున్నా.. గిరీశ్ కర్నాడ్‌తో మాట్లాడిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది. అంతకుముందు జరిగిన అవమానాన్ని మరిచిపోయేలా చేసింది. తాను 12వ తరగతి చదువుతున్నానని.. అంతేకాకుండా నాటకాల్లో చేస్తున్నట్లు డైరెక్టర్‌తో చెప్పినట్లు గుర్తు చేసుకుంది సోనాలి కులకర్ణి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)