Breaking News

ఆ స్టార్‌ హీరోతో గొడవలు.. తిట్టాలన్నంత కోపం వచ్చేది: సోనాలి బింద్రె

Published on Tue, 06/03/2025 - 13:43

బంగారు కళ్ల బుచ్చమ్మో.. పాటలో అమాయకంగా కనిపించి అందర్నీ ఇట్టే బుట్టలో వేసుకుంది హీరోయిన్‌ సోనాలి బింద్రె (Sonali Bendre). మురారి సినిమాలో ఆమె నటనకు తెలుగులో బోలెడన్ని ఆఫర్లు వచ్చాయి. అలా ఇంద్ర, ఖడ్గం, మన్మథుడు, శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌ వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించకుండా పోయింది. దాదాపు 20 ఏళ్లలో కేవలం మూడే సినిమాలు చేసింది. బుల్లితెరపై ప్రసారమయ్యే షోలలో జడ్జిగా కనిపించేది.

ముఖం చిట్లించేవాడు
తాజాగా ఆమె ఓ స్టార్‌ హీరోతో చేసిన సినిమా అనుభవాల్ని పంచుకుంది. బాలీవుడ్‌ బబుల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనాలి బింద్రె మాట్లాడుతూ.. 1999లో వచ్చిన హమ్‌ సాత్‌ హై సినిమాలో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan)తో కలిసి నటించాను. ఆ సినిమా షూటింగ్‌లో సల్మాన్‌ నన్ను చూసి ముఖం చిట్లించేవాడు. అది చూసి నాకు చాలా కోపమొచ్చేది. తను నచ్చేవాడే కాదు. ఎప్పుడూ పోట్లాడుతూనే ఉండేవాళ్లం.

తిట్టాలన్నంత కోపం
క్లోజప్‌ షాట్స్‌ ఉన్నప్పుడు కూడా తన ముఖం అదోలా పెట్టేవాడు. అసలు నీ సమస్య ఏంటి? అని తిట్టాలనిపించేది. కానీ అలా చేయలేకపోయాను. అయితే సల్మాన్‌ బయటకు కనిపించేంత కఠినాత్ముడు కాదు. తను చాలా మంచివాడు. సినిమా షూటింగ్‌ అయ్యేకొద్దీ అతడి గురించి కొద్దికొద్దిగా తెలుసుకుంటూ వచ్చాను. తను బయటకు కోపంగా కనిపిస్తాడు. అందరూ తనను ద్వేషించాలన్నట్లుగానే ప్రవర్తిస్తాడు.

బ్లాక్‌బస్టర్‌ బొమ్మ
కానీ తను మృదు స్వభావి. అతడి లోని మంచి మనిషిని తెలుసుకోవడానికి చాలా కష్టపడాల్సిందే అని చెప్పుకొచ్చింది. సల్మాన్‌, సోనాలి జంటగా నటించిన హమ్‌ సాత్‌ హై సినిమాను సూరజ్‌ బార్జాత్యా తెరకెక్కించాడు. ఇందులో సైఫ్‌ అలీ ఖాన్‌, టబు, మోహ్నిష్‌, కరిష్మా కపూర్‌ తదితరులు నటించారు. ఈ సినిమా ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.

చదవండి: రెండో భర్త మరణం.. చిన్ననాటి క్రష్‌తో ఐదేళ్లుగా కాపురం: హీరోయిన్‌

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)