Breaking News

ప్రముఖ రాజకీయ నాయకుడితో రిలేషన్‌.. సోనాలి బింద్రే క్లారిటీ!

Published on Mon, 06/09/2025 - 19:04

మురారి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మురిపించిన ముద్దుగుమ్మ సోనాలి బింద్రే. ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సోనాలి తన కెరీర్‌లో ఎదుర్కొన్న అనుభవాలను అభిమానులతో పంచుకుంటోంది. సల్మాన్‌ ఖాన్‌తో ఓ మూవీ సెట్‌లో ఎదురైన సంఘటనను ఇటీవలే వెల్లడించింది. ఆ సమయంలో అతనిపై విపరీతమైన కోపం వచ్చేదని తెలిపింది. అయితే తన క్యాన్సర్‌ చికిత్స సమయంలో అమెరికా వచ్చి తన ఆరోగ్యం గురించి ఆరా తీశాడని కూడా చెప్పుకొచ్చింది.

తాజాగా ప్రముఖ రాజకీయ నాయకుడు రాజ్ థాకరే 20 ఏళ్ల క్రితం తనను ఇష్టపడ్డారన్న రూమర్స్‌పై బాలీవుడ్ నటి సోనాలి బింద్రే  స్పందించారు. ఈ వార్తలపై సోనాలి అసంతృప్తి వ్యక్తం చేసింది. అందులో ఎలాంటి నిజం లేదన్నారు. తాను ఎప్పుడూ అలాంటి వార్తలను పట్టించుకోలేదని సోనాలి తెలిపింది. 

సోనాలి మాట్లాడుతూ.. 'నాపై ఇలాంటి ప్రచారం జరిగినట్లు నాకే తెలియదు. కొందరు సోషల్ మీడియాలో ఇలా మాట్లాడుకుంటున్నారని ఇప్పుడే తెలిసింది. నిజంగా ఇది చాలా బాధాకరం. మా రెండు కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. రాజ్‌ థాకరే భార్య షర్మిలా, ఆమె తల్లికి మా పిన్ని మంచి స్నేహితురాలు. ఆ విధంగా ఇరు కుటుంబాల మధ్య మా చిన్నతనం నుంచే మంచి స్నేహం ఏర్పడింది. అలా ఇరు కుటుంబాల మధ్య నా చిన్నప్పటి నుంచే మంచి అనుబంధం ఉంది. ఇప్పటికీ ఆ రిలేషన్‌ అలాగే ఉందని' తెలిపింది. కాగా.. సోనాలి బింద్రే చివరిసారిగా 'ది బ్రోకెన్ న్యూస్ సీజన్ 2'లో కనిపించింది. ఈ సిరీస్‌ జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)